'బుట్టా' పని పట్టేసిన చంద్రబాబు

Update: 2018-11-02 14:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడాన్ని మించిన పిచ్చి పని ఇంకేదీ ఉండదంటారు ఆయన చేతిలో దెబ్బయిపోయినవారంతా. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో మహిళా నేత కూడా చేరబోతున్నారట. రాజకీయంగా చంద్రబాబు చేసే మోసాల గురించి ఇప్పటికే మీటూ అంటూ ఎందరో దశాబ్దాలుగా చెప్పుకొంటున్నారు. తాజాగా ఓ మహిళా ఎంపీకి కూడా చంద్రబాబు భారీ షాక్ తగలబోతోందని టీడీపీలో వినిపిస్తోంది. ఎన్నో ఆశలు చూపడంతో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆ మహిళా ఎంపీకి ఇప్పుడు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడం లేదట.
   
ఫిరాయింపు ఎంపి బుట్టాకు చంద్రబాబునాయుడు షాకివ్వనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలు లోక్ సభకు ఎన్నికైన బుట్టా రేణుక తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు.  ఇప్పుడు కాంగ్రెస్ తో తెలుగుదేశంపార్టీ పొత్తులు పెట్టుకోవటంతో బుట్టాకు సమస్యలు మొదలయ్యాయి. పార్టీ ఫిరాయించేటపుడు వచ్చే ఎన్నకల్లో మళ్ళీ ఎంపి టిక్కెట్టుపై చంద్రబాబు నుంచి ఆమె హామీ పొందారు. ఆమధ్య కర్నూలు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ మాట్లాడుతూ - వచ్చే ఎన్నికల్లో బుట్టాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కూడా. కానీ, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయం మొత్తం సీనును మార్చేస్తోంది.
   
కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్‌ కు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. అక్కడ కోట్ల సూర్యప్రకాశ్  రెడ్డి పోటీ చేస్తే గెలుపు ఖాయం కాబట్టి చంద్రబాబు ఈ స్కెచ్ వేశారని టాక్. ఈ సంగతి ఇప్పటికే కర్నూలు టీడీపీలో బలంగా వినిపిస్తుండడంతో బుట్టా రేణుక ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట. చంద్రబాబును కలిసేందుకు వారం రోజులుగా ఆమె చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదట. సారు.. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు తిరుగుతుంటే బుట్టా రేణుకకు అపాయింటుమెంటు ఇచ్చేదెవరు?


Tags:    

Similar News