ఏపీలో ఇప్పుడు ఓ మాట వైరల్ అవుతోంది. టీడీపీ అధినేత - ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహారానికి సంబంధించిన ఈ మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా. అయితే దేశంలోని మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా... లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఈ కోడ్ అమలు కాస్తంత కఠినంగానే ఉంటుంది కదా. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి కదా. అదీ కాకుండా... పోలింగ్ కు - కౌంటింగ్ కు ఏకంగా నెలన్నర గ్యాప్ ఉంది కదా. ఈ 45 రోజుల పాటు ఏపీని ఎవరు పాలించాలి? ప‌్రజలెన్నుకున్న ప్రభుత్వం మాదే కదా అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అయితే కోడ్ అమల్లో ఉండగా బాబు పప్పులు ఉడకలేదు.
ఈ క్రమంలోనే బాబుకు ఊపిరి ఊదినట్టుగా ఫణి తుఫాన్ తరుముకుని వచ్చేసింది. అత్యవసర పరిస్థితుల్లో కోడ్ ను ఎత్తేస్తారు కదా. ఇలా తుఫాను ప్రభావం ఉన్న ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల్లో కోడ్ ను ఎత్తేశారు. దీంతో చంద్రబాబు సమీక్షలంటూ రంగంలోకి దిగిపోయారు. ఇదే సమయంలో శ్రీకాకుళం వైపు దూసుకొస్తున్నట్లుగానే కనిపించిన ఫణి తుఫాన్ తన రూట్ ను మార్చేసుకుని ఒడిశా వైపు మళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కొత్త లాజిక్ తెర మీదకు వచ్చింది. చంద్రబాబు రంగంలోకి దిగిన వెంటనే ఫణి తుఫాను తోక ముడిచిందట. ఇప్పుడు ఈ కొత్త లాజిక్ ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ముచ్చట్లు పెట్టినా...ఈ లాజిక్ తప్పనిసరిగా వారి మధ్య చర్చకు వస్తోందట.