ఎన్నికల వేళ రాష్ట్ర స్థాయిల్లో పని చేసే అధికారుల బదిలీలు కొత్త కాదు. ఇదంతా రొటీన్ గా జరిగేదే. ప్రత్యేకించి ఉన్నత పదవుల్లో ఉన్న పోలీసుల అధికారులను ఎన్నికల వేళ బదిలీ చేయడం చరిత్రలో కొత్తేమీ కాదు.గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి విషయాలను పలు సార్లు తెర మీదకు తీసుకు వచ్చారు. అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తూ ఉన్నారని కొంతమంది అధికారుల మీద బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ కు బాబు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఆ బదిలీలు చేసేంత వరకూ కూడా బాబు పోరాడారు.
అలాంటి వ్యవహారం 2009లో చోటు చేసుకుంది. ఆ ఎన్నికల వేళ ఏపీ డీజీపీగా ఉండిన ఎస్.ఎస్.పి. యాదవ్ ను బదిలీ చేయాలని చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టు పట్టారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారని.. యాదవ్ ను బదిలీ చేయాలని బాబు ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.
యాదవ్ పై తీవ్రమైన అభ్యంతరాలు తెలిపి, బోలెడన్ని కంప్లైంట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. చివరకు చంద్రబాబు నాయుడు ఫిర్యాదుల మేరకు ఏపీ డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. యాదవ్ స్థానంలో మరొకరిని డీజీపీగా నియమించింది. అది పదేళ్ల కిందట జరిగిన ఘటన.
అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి అలా డీజీపీని ఈసీ ద్వారా బదిలీ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు.. పోలీసు ఉన్నతాధికారుల విషయంలో ఈసీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడలేదు.ఈసీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు.
మరి ఆనాడు ప్రతిపక్షం డిమాండ్ కు అనుగుణంగా ఈసీ అధికారులను బదిలీ చేసినా.. నాటి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఆమలు చేసింది. ఈసీ మీద నాటి వైఎస్ ప్రభుత్వం కోర్టుకు ఎక్కలేదు.అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అధికారుల బదిలీల విషయంలో అత్యంత తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈసీ మీద కోర్టుకు కూడా వెళ్లారు. చంద్రబాబు నాయుడు అప్పుడు అలా, ఇప్పుడు ఇలా వ్యవహరిస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది.