సర్కారీ ఉద్యోగాన్నిఎన్టీఆర్ ఎన్నిరోజులు చేశారు?

Update: 2016-01-19 04:24 GMT
దివంగత ప్రజానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి కమ్ ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు. నటుడిగా.. రాజకీయ నేతగా జాతీయ.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన స్వల్ప వ్యవధిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని చంద్రబాబు చెబుతూ. ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగంలోకి చేరి కేవలం 11 రోజులు మాత్రమే విధులు నిర్వహించారని.. అయితే.. అవినీతి వాతావరణం ఆయన్నుతెగ ఇబ్బంది పెట్టిందన్నారు. అందుకే.. ఆ తరహా వాతావరణంలో ఇమడలేక ఉద్యోగంలో చేరిన 11 రోజులకే తన జాబ్ కు రిజైన్ చేసేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ కానీ రాజీపడి సబ్ రిజిస్ట్రార్ గా కొనసాగి ఉంటే..? ఊహించటానికి కూడా కష్టంగా ఉంది కదూ.
Tags:    

Similar News