వామ్మో.. బాబు మ‌ళ్లీ మొద‌లెట్టేశార్రా..?

Update: 2019-06-12 04:42 GMT
ఓ ప‌క్క రాకెట్ వేగంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. వాటి అమ‌లు కోసం ఉరుకులు ప‌రుగులు తీస్తూ.. కొత్త త‌ర‌హా పాల‌న‌ను చూపిస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇలాంటివేళ‌.. ఆయ‌న స్పీడ్ కు అందుకొని.. ఆయ‌న చేసే త‌ప్పుల్ని ఎత్తి చూపాల‌ని అనుకున్న‌ప్పుడు.. మ‌రెంత వేగంగా నిర్ణ‌యాలు తీసుకోవాలి. సాధార‌ణంగా ఏ కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డినా ఆర్నెల్ల పాటు అన్ని అంశాల్ని స‌మీక్షించుకుంటూ మౌనంగా ఉండ‌టం కామ‌న్‌.

అందుకు భిన్నంగా ప‌ట్టుమ‌ని ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు వారాలు గ‌డవ‌కుండానే విమ‌ర్శ‌లు మొద‌లెట్టేసిన చంద్ర‌బాబు తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. అర్థం లేని వాద‌న‌ల్ని తెర మీద‌కు తీసుకురావ‌టంపై ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ హ‌యాంలో చేప‌ట్టిన ప‌థ‌కాల్ని అమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌టం విశేషం. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన రుణ‌మాఫీ ప‌థ‌కం నాలుగైదు వాయిదాల్లో మొత్తాన్ని త‌క్ష‌ణం రైతుల‌కు విడుద‌ల చేయాల‌ని ఇప్పుడాయ‌న నేతృత్వంలోని పార్టీ జ‌గ‌న్ స‌ర్కారుకు విజ్ఞ‌ప్తి చేయ‌టం విశేషం.

అధికారం చేజారిన త‌ర్వాత‌.. త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాల్ని అమ‌లు చేయాల‌ని కోర‌టం ఒక చిత్రంగా చెప్పాలి. ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక పాల‌నా ప‌ర‌మైన అవ‌గాహ‌న ఉంటుంది. తాము చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్ని అమ‌లు చేయాల‌ని అడ‌గ‌టం అర్థం లేనిద‌ని చెప్పాలి. ఒక ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు రిజెక్ట్ చేశారంటే.. తాము వారి పాల‌న‌లోని నిర్ణ‌యాల్ని రిజెక్ట్ చేసిన‌ట్లే క‌దా?  అలాంట‌ప్పుడు తాము అమ‌లు చేసిన వాటిని కంటిన్యూ చేయ‌మ‌ని ఎలా అడుగుతారు? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఒక‌వేళ తాము అమ‌లు చేసిన ప‌థ‌కాలు అద్భుత‌మ‌నే అనుకుందాం. వాటిని అమ‌లు చేయ‌లేద‌నుకుందాం. అలాంట‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి కొత్త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త ఎదుర‌వుతుంది. ప్ర‌తిప‌క్షంగా వారికి కావాల్సింది అదేగా. అందుకు భిన్నంగా త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ప‌థ‌కాల్ని అమ‌లు చేయాల‌ని బాబు అడ‌గ‌టంలో అర్థం లేదు. అదేమంటే.. వైఎస్ హ‌యాంలో చేప‌ట్టిన ప‌థ‌కాల్ని తాము అమ‌లు చేసిన‌ట్లు ఇప్పుడాయ‌న చెబుతున్నారు.

ఒక‌వేళ అదే నిజ‌మ‌ని అనుకుందాం.. ఆ విష‌యాన్ని గ‌డిచిన ఐదేళ్ల‌లో బాబు ఒక్క‌సారైనా ప్ర‌స్తావించారా?  తాను ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు చేయ‌ని విష‌యాల్ని.. అనుస‌రించిన విధానాల్ని తాజా అధికార‌ప‌క్షం చేయాల‌ని కోర‌టంలో ఏమైనా అర్థ‌ముందా? అని ప్ర‌శ్న‌.

ఏదైనా వాద‌న‌ను వినిపిస్తే అందులో అంతో ఇంతో లాజిక్కు ఉండాలి. కానీ.. అదేమీ లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా బాబు చెబుతున్న మాట‌ల్ని చూస్తే.. వామ్మో మ‌ళ్లీ మెద‌లెట్టేశార్రా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ప్ర‌జాతీర్పు దారుణంగా వ‌చ్చిన త‌ర్వాత కూడా అదే ప‌నిగా మాట్లాడ‌టం.. అర్థం లేని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం ద్వారా ప్ర‌తిప‌క్షానికి రావాల్సిన సానుభూతిని మిస్ కావ‌టం ఖాయం.
Tags:    

Similar News