చిన్నపాటి వ్యతిరేకత తలెత్తకుండా తాము కొత్త రాష్ట్రాల్ని ఏర్పాటు చేసినట్లుగా బీజేపీ నేతలు తరచూ గొప్పలు చెప్పుకుంటుంటారు. బీహార్ నుంచి ముక్కలు చేసిన జార్ఖండ్ గురించి గొప్పగా చెప్పుకునే వారు.. ఆ రాష్ట్ర రాజధాని రాంచీ గురించి మాత్రం ప్రస్తావనే తీసుకురారు. విభజన జరిగి 15 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజధాని నగరం ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించవు.
ఎన్డీయే హయాంలో ఏర్పడిన ఈ రాష్ట్రం.. యూపీఏ సర్కారు హయాంలో నిర్లక్ష్యానికి గురైనట్లు సర్ది చెప్పుకున్నా.. మోడీ సర్కారు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ రాష్ట్ర రాజధాని పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని చెబుతారు. కేవలం రెండు వేల ఎకరాల్లో నిర్మాణం సాగిస్తున్న జార్ఖండ్ రాజధాని పరిస్థితి ఇలా ఉంటే.. దాదాపు 33 వేల ఎకరాల్లో నిర్మించాలని తలపెట్టిన అమరావతి పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది.
జార్ఖండ్ రాజధాని నిర్మాణం మొదలు పెట్టి పదిహేనేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ రాజధాని పూర్తి అయిన దాఖలాలే కనిపించవు. దశాబ్దాన్నరం గడిచిన తర్వాత కూడా సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ .. ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయిన దాఖలాలు కనిపించవు. ఇప్పటికి పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నట్లు కనిపిస్తాయి.
కళ్ల ముందు జార్ఖండ్ రాజధాని దుస్థితి కనిపిస్తే.. ఏపీ ప్రజల కలల స్వప్నమైన అమరావతి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. అయితే.. జార్ఖండ్ లో మాదిరి కాకుండా.. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో ఉన్న సర్కారు చురుగ్గా వ్యవహరిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. ఏపీ రాజధాని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో బాబుకు చక్కటి విజన్ ఉందనే చెప్పక తప్పదు.
కేంద్రం నుంచి వచ్చే నిధుల మీద మాత్రమే ఆధారపడని ఆయన.. రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయటానికి వీలుగా.. ఇప్పటికే సింగపూర్.. జపాన్ ప్రభుత్వాల్ని సంప్రదించటం.. వారి సలహాలు తీసుకోవటం కనిపిస్తుంది. సమర్థవంతమైన నాయకత్వం లోపిస్తే.. అమరావతి పరిస్థితి రాంచీని తలపిస్తుందని.. కానీ.. చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ఏపీ సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించే వీలుందన్న భావన కలుగుతుంది. ఏపీని ముంచాలన్నా.. తేల్చాలన్నా చంద్రబాబు చేతుల్లో ఉందని చెప్పక తప్పదు. రాజధాని నిర్మాణంలో ఇప్పటివరకూ ఆయన మాటల్లో చూపిస్తున్న ఆత్మవిశ్వాసం చేతల్లో చూపించి.. అందుకు తగ్గట్లే అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేస్తే.. చంద్రబాబు పేరు ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవటం ఖాయం.