విభజన తర్వాత తరచూ తెలుగు ప్రజల్లో చాలామంది పలు సందర్భాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని.. వారి పని తీరును.. వారి వ్యూహాల్ని తరచూ పోలుస్తుంటారు. ఈ ఇద్దరి చంద్రుళ్ల మధ్య కొన్ని పోలికలు కలిసినట్లు కనిపించినా.. చాలా అంశాల్లో వారిద్దరి ఆలోచనలు ఒకటేలా ఉన్నా.. వారు ఎంచుకున్న మార్గాలు మాత్రం వేరుగా ఉండటం కనిపిస్తుంది. అలాంటి వాటిల్లో అత్యంత కీలకమైనది.. తమ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఇద్దరు చంద్రుళ్లు ఎలా వ్యవహరిస్తారన్నది.
మొదట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే.. ప్రత్యర్థులకు అస్సలు అవకాశం ఇవ్వరు. ఒకవేళ అనుకోకుండా అలా జరిగితే.. ప్రత్యర్థి కంటే పైచేయి చాటేందుకు తాను వెనక్కి తగ్గుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. వెనక్కి తగ్గినట్లు కాదు.. మరింత పక్కాగా లక్ష్యాన్ని చేరుకోవటం కోసమే అడుగులు వెనక్కి వేసిన చందంగా కేసీఆర్ వైఖరి ఉంటుంది. రాజకీయంగా తన ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టేందుకు.. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉంటేందుకు సైతం కేసీఆర్ వెనుకాడరు. అరే.. కేసీఆర్ ఇంతలా తగ్గిపోయారే అన్నట్లుగా అనిపించేలా వ్యవహరిస్తూనే.. తేడా వస్తే కేసీఆర్ కప్పి పుచ్చకుండా.. ఇగోలకు పోకుండా వెనకడుగు వేస్తారు భయ్ అన్న పాజిటివ్ మాటను తన సొంతం చేసుకోవటం కనిపిస్తుంది.
కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. విషయాన్ని నానబెట్టాలన్నా.. ఏదైనా విషయం మీద వెనక్కి తగ్గేందుకు అస్సలు వెనక్కి తగ్గరు. వెనకడుగు వేయటం అంటే.. తప్పుచేసినట్లు ఒప్పుకోవటమే అన్నట్లుగా వ్యవహరిస్తారు. అవసరమైతే.. ఆ విషయం మీద ఏదో చేసినట్లుగా హడావుడి చేస్తారు కానీ.. నిజానికి ఏం చేయరన్న విషయం స్పష్టంగా అర్థం కావటమే కాదు.. తన రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాల్ని వారి చేతికి ఇచ్చిన వైనం కనిపిస్తుంది. తన వైఖరితో.. ప్రత్యర్థి చేతికి బందర్ లడ్డూ ఇవ్వటం ఎలా అన్నది బాబు అనుసరించే విధానాలు.. తీసుకునే నిర్ణయాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
అందుకు నిదర్శనంగా తాజాగా ఏపీలో రగులుతున్న మెగా అక్వాఫుడ్ పార్క్ ముచ్చటనే తీసుకుంటే.. దాదాపు ఏడాదిగా ఈ ప్రాజెక్టును అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కీలకమైన అంశం ఏమిటంటే.. తమ ప్రాంతానికి వచ్చిన ఫుడ్ పార్క్ ను వారు ఏ మాత్రం వ్యతిరేకించటం లేదు. కంపెనీ వారు ఎంపిక చేస్తున్న ప్రాంతాన్ని మాత్రమే వారు వ్యతిరేకిస్తున్నారు. పచ్చటి పొలాల మధ్యలో విషతుల్యమైన ఫ్యాక్టరీని పెట్టటం సరికాదని.. అందుకు భిన్నంగా పంటలు పండని భూముల్లో దీన్ని ఏర్పాటు చేయాలని.. కుదిరితే సముద్రానికి దగ్గరగా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మిగిలిన మాటలు ఎలా ఉన్నా.. ఆందోళన చేస్తున్నవారి డిమాండ్ లో న్యాయం వారి మాటల్లో స్పష్టంగా కనినిస్తుంటుంది. కారణం ఏదైనా.. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ తర్వాతే పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అక్వా ఫుడ్ పార్క్ మీద పవన్ ప్రెస్ మీట్ అనంతరం.. గంటల వ్యవధిలోనే చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. చివరకు తేలిందేమిటంటే.. అక్వా ఫుడ్ పార్క్ ను తరలించే పని లేదు. కాలుష్యం వెదజల్లకుండా చర్యలు తీసుకోవటం.. ఫుడ్ పార్క్ నుంచి సముద్రానికి ప్రత్యేకంగా పైపు లైన్లు వేసి వ్యర్థ జలాల్ని వాటి గుండా సముద్రంలోకి వదలటం.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యేలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి.. ఫుడ్ పార్క్ విషయంలో నెలకొన్న భయాందోళనల్ని తొలగించే పని చేయటం.
ఇలాంటి నిర్ణయాలతో వచ్చే లాభం ఏమిటో బాబుకే తెలియాలి. ఇంత చేసిన ఆయన.. ఈ ఇష్యూలో పలు విమర్శలు వెల్లువెత్తిన పోలీసుల పాత్రను కానీ.. పలువురిపై పెట్టిన బైండోవర్ కేసుల విషయాన్ని కానీ ప్రస్తావించారా అంటే లేదనే చెప్పాలి. తన దృష్టికి వచ్చిన అంశంపై ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వని రీతిలో ఇష్యూను ఉంచటంతో.. తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సందర్శించటం.. బాధితుల్ని పరామర్శించటం.. వారికి అండగా ఉంటానని మాట ఇవ్వటం.. ఈ ఇష్యూలో ఉద్యమం చేసి జైల్లో ఉన్న ఉద్యమకారిణి సత్యవతిని పరామర్శించటం లాంటివి చేయనున్నారు. ఇష్యూను గుర్తించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని క్లోజ్ చేయటం మరో ఎత్తు. ఆట మొదలెట్టే చంద్రబాబు.. ఆటను తనకు అనుకూలంగా మార్చుకోవటం.. మ్యాచ్ విన్నర్ గా అవతరించటం లాంటి విషయాల్లో చేసే తప్పులు.. విపక్ష నేతకు అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తారనటంలో సందేహం లేదు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో పర్యటించనున్న జగన్.. అక్వా ఫుడ్ పార్క్ మీద ఎంతలా చెలరేగిపోతారో చూస్తే.. బాబు చేసే తప్పులు ఎంత కాస్ల్టీగా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/