ఓటుకు నోటు యవ్వారతో పాటు.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారాలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని కుదిపి వేస్తున్న సమయంలో ప్రధాని మోడీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలవటం తెలిసిందే.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు మించి ఎక్కువ సమయాన్ని మోడీతో గడిపిన బాబు.. తర్వాత ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్.. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలపై తాను ప్రధానమంత్రితో మాట్లాడినట్లు తేల్చేశారు. ఈ సందర్భంగా మోడీ నుంచి ఏదైనా హామీ లభించిందా? అన్న మాటకు.. ప్రధాని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు.
సెక్షన్ 8 అమలు.. గవర్నర్ పూర్తి స్థాయిలో అధికారాలు ఉపయోగించేలా చూడటం లాంటి అంశాల గురించి మాట్లాడానని.. వాటిపై లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. ప్రధాని నుంచి తనకు హామీ లభించిందన్న విషయంలో బాబు తొందరపాటుతో మాట్లాడారన్న మాట వినిపిస్తోంది. తాను ఇరుక్కోవటం కాకుండా.. మోడీని కూడా బాబు ఇరికించేటట్లు ఉన్నారే..?