అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా.. మరింతగా ప్రజాదరణను పెంచుకుంటూ పోవడంతో పాటూ.. పార్టీగా మరింత బలపడాలని కోరుకుంటుంది. ఎప్పటికప్పుడు తమకు పెరుగుతున్న జనాదరణ ఏ మోతాదులో ఉన్నదో చెక్ చేసుకోవాలని కూడా అనుకుంటుంది. రాష్ట్ర పాలనలో ఒకసారి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు - మునిసిపాలిటీలు ఇతరత్రా రూపేణా తరచూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజాదరణ ఎలా ఉన్నదో వారికి అర్థమవుతూ ఉంటుంది. దాన్ని బట్టే.. ఆ తదుపరి కార్యాచరణను కూడా వారు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా సహజమైన ప్రక్రియ. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రక్రియకు ఎందుకు దూరం జరుగుతున్నారు.
ఒకసారి అధికారం దక్కిన తర్వాత.. మరో రకం ఎన్నికల తన రాష్ట్రంలో నిర్వహించడానికి ఆయన భయపడుతున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. అదే సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా సరే అప్రతిహతంగా విజయాలు నమోదుచేస్తూ సీఎం కేసీఆర్ దూసుకుపోతూ ఉంటే.. ఏపీలో నిర్వహించాల్సిన ఎన్నికలకు సంబంధించి.. మీనమేషాలు లెక్కిస్తూ చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు ఆయనలో భయానికే సంకేతం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత ఇప్పటిదాకా చాలా ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ - కడియం రాజీనామాల వల్ల ఖాళీ అయిన స్థానాలో మళ్లీ విజయం పెద్ద గొప్ప కాదు గానీ, ఇతరత్రా అనేక ఎన్నికల్లో కూడా తెరాస ఘన విజయం సాధించింది. వారికి ఒక్క వార్డుకు కూడా అదివరలో ఠికానా లేని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం రికార్డు విజయాల్ని నమోదు చేసింది. కేసీఆర్ తమ రాష్ట్రంలో ఏ ఎన్నికలు కూడా పెండింగ్ లో ఉండే పరిస్థితి లేకుండా వరుసగా నిర్వహించుకుంటూ వెళుతున్నారు. వరుసగా విజయాలు నమోదు చేస్తూనే ఉన్నారు.
అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మరణించిన చోట్ల ఉప ఎన్నికలు మాత్రం జరిగాయి. మునిసిపాలిటీలకు పెండింగ్ లో ఉన్న ఎన్నికలు ఏమీ ఇప్పటిదాకా జరగనేలేదు. ఒంగోలు - కర్నూలు - కాకినాడ - తిరుపతి ఇలా మునిసిపాలిటీలు అనేకం ఎన్నికల కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. అయితే చంద్రబాబునాయుడు ఎన్నికల నిర్వహణ విషయంలో దూకుడుగా సత్వర నిర్ణయాలు తీసుకోవడం లేదు.
నిజానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల ముందుకు ఎన్నికల రూపేణా వెళ్లడానికి చంద్రబాబు జంకుతున్నారని, ఓటమి తప్పకపోవచ్చునని భయపడుతున్నారని కొన్ని అంచనాలు సాగుతున్నాయి. తెదేపా పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, ఎన్నికల నాటి హామీలు చాలా వరకు పెండింగ్ లోనే ఉండడం పార్టీలోనూ కొంత భయాన్ని కలిగిస్తున్నదని, అందుకే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోతున్నారని పలువురు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రభుత్వం పనితీరు మీద చంద్రబాబులో కూడా పూర్తిస్థాయి నమ్మకం లేదని.. అందుకే ఆయన ఏ ఎన్నికలన్నా భయపడుతున్నారని ప్రజలు అంటున్నారు.