ఏపీ డీజీపీ జాస్తి వెంకట రాముడు పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుండటంతో కొత్త డిజిపి ఎంపికకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. డిజిపి కోసం పలువురు సీనియర్ ఐపిఎస్ లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే... ముఖ్యమంత్రి చంద్రబాబు మదిలో మాత్రం ఓ అధికారి ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియారిటీ ప్రకారం ప్రస్తుత డీజీపీ తరువాత వెంటనే లేకున్నా కూడా చంద్రబాబు మాత్రం ఆయన పట్లే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత డిజిపి తరువాత సీనియార్టీ లిస్టులో ఉన్న వివేక్ దూబె కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. మరో అధికారి వెంకట రమణమూర్తి ఉన్నారు. అయితే... సీఎం మాత్రం వీరిద్దరి తరువాత ఉన్న ఆర్టీసీ ఎండీ సాంబశివరావును డీజీపీ చేయాలని అనుకుంటున్నారు. పోలీసు వర్గాల్లో ఇది బాగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే వారం రోజుల క్రితమే ఆయనకు డిజి క్యాడర్ కు పదోన్నతి లభించింది.
సీనియర్ల జబితాలో ఇంకా టి. కృష్ణరాజు - ఎమ్.మాలకొండయ్య - విఎస్ కె.కౌముది - ఆర్ పి.ఠాకూర్ ఉన్నారు. సీనియారిటీ ప్రకారం సాంబశివరావు కంటే ఇద్దరు ముందున్నా కూడా వారిని కాదని చంద్రబాబు ఆయనకే ఛాన్సు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.