ఏ విషయాన్ని ఎప్పుడు ప్రస్తావించాలో.. దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలో.. రాష్ట్ర ప్రయోజనాలు తప్పించి మరింకేమీ తనకు అవసరం లేదన్నట్లుగా ఎలా వ్యవహరించాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియనివి కావు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మాత్రం తెలీవనే చెప్పాలి. పదిహేను రోజుల క్రితం ప్రధాని నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించిన రెండో రోజునే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన అసంతృప్తిని వ్యక్తం చేయటమే కాదు.. సంపన్న రాష్ట్రంగా తరచూ ఆయన చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రధాని నిర్ణయంతో దెబ్బ తిందన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. రెండు రోజులకోసారి.. మోడీ తీసుకున్న నిర్ణయంతో తమ ఆదాయానికి ఎంత ఎఫెక్ట్ అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ప్రజలకు అప్ డేట్ చేసే ప్రయత్నం చేశారు.
ధనిక రాష్ట్రంగా చెప్పే తెలంగాణకే నోట్ల రద్దు తిప్పలు ఇంత భారీగా ఉంటే.. అప్పుల సంద్రంలో మునిగిన ఏపీకి మరెన్ని తిప్పలో అన్న భావన పలువురు వ్యక్తం చేసినా.. ఏపీ ముఖ్యమంత్రి నోటి నుంచి మాత్రం కష్టాల మాట రాలేదు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తాను ఎప్పటి నుంచో చెప్పానని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని.. మోడీ నిర్ణయం వెనుక తన మాటలు ఉన్నట్లుగా ఆయన ప్రచారం చేసుకోవటం పైనే ఫోకస్ చేశారు. తన వ్యక్తిగత ఇమేజ్ మీద చూపించిన ఆసక్తి.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల మీద చంద్రబాబు చూపించి ఉంటే బాగుండేది.
దురదృష్టవశాత్తు అలాంటివి చోటు చేసుకోలేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికిప్పుడు తమ రాష్ట్ర ఆదాయం ఏ మేరకు నష్టపోయిందో చెబుతూ.. కేంద్రం తమను ఆదుకోవాలని.. కేంద్రానికి చెల్లించే చెల్లింపుల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాలన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి ఇలాంటివి కేసీఆర్ కంటే చంద్రబాబు ముందు చేయాల్సి ఉంది. కానీ.. రద్దు నిర్ణయంపై ప్రజల్లో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారన్న అంచనాతో.. ఆ మైలేజీలో ఎంతోకొంత భాగాన్ని తానుచేజిక్కించుకోవాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారని చెప్పక తప్పదు.
దీంతో.. నోట్ల రద్దుకారణంగా ఏపీకి జరిగే నష్టాన్ని ఆయన పెద్దగా ప్రస్తావించలేదు. నోట్ల రద్దు అనంతరం.. ప్రజలు పడుతున్న కష్టాలు.. బ్యాంకుల వద్ద క్యూ లైన్ల దెబ్బకు రద్దు నిర్ణయం కారణంగా ఇమేజ్ పెరగటం తర్వాత.. డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు.. ఇప్పుడిప్పుడే రాష్ట్ర సమస్యల్ని తెరమీదకు తెస్తున్నారు. ప్రధాని తీసుకున్న రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ ఆదాయం భారీగా పడిపోయిందని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతూ.. నష్టపోయిన మొత్తానికి సంబంధించి నివేదికను కేంద్రానికి పంపి.. సాయం కోసం ప్రయత్నిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యక్తిగత ఇమేజ్ మీద చేసే ఫోకస్ రాష్ట్రం మీద చేస్తే బాగుంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/