గోదావరి జలాలు కృష్ణా నదిలో చేరిన పవిత్ర సమయం.. ఇది పవిత్ర సంగమం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజులుగా తెగ ఊదరగొట్టేశారు. పట్టిసీమ ప్రారంభం అయిపోతోందంటూ ప్రచారం ఒకటి. దాని నుంచి నీళ్లు వచ్చేస్తాయంటూ గొప్పలు.. వెరసి.. ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వచ్చింది.
బుధవారం ఉదయం 8.45 గంటలకు చంద్రబాబు నాయుడు పట్టిసీమలో మొదటి పంపునకు పూజ చేసి లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పినా అప్పటికి అది పూర్తి కాలేదు. దాంతో శుక్రవారం నాటికి మొదటి పంపు పూర్తయింది. దాంతో శుక్రవారం మధ్యాహ్నం మంత్రి దేవినేని ఉమా పట్టిసీమ మొదటి పంపు స్విచ్ ఆన్ చేసి దాని నుంచి 350 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాల్వలోకి వదిలారు. తద్వారా పట్టిసీమ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు.
ఇక, కృష్ణా నదిలో గోదావరి జలాల పవిత్ర సంగమాదిని మరో కథ. కొద్ది రోజుల కిందట తాడిపూడి ఎత్తిపోతల నుంచి పోలవరం కుడి కాల్వ ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు కదా. అది కొద్ది రోజుల కిందట ఇబ్రహీంపట్నం చేరింది. అక్కడ అడ్డుకట్ట వేసి గోదావరి జలాలను అక్కడ నిలుపు చేశారు. పట్టిసీమ మొదటి పంపును ప్రారంభించే రోజు అక్కడ దానికి స్విచ్ ఆన్ చేసి ఆ నీళ్లు ఇబ్రహీంపట్రం వచ్చినట్లు చెప్పి ఇక్కడ పవిత్ర సంగమం నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. దాంతో తాడిపూడి నుంచి పంపిన గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసినట్లు పండుగ చేశారు.
నిజానికి ఇక్కడ పట్టిసీమ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. పోలవరం మాటే లేదు. పోలవరం కాల్వకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. నదుల అనుసంధానం జరిగినట్లు కనిపించినా అది కూడా పాక్షికమే. అయినా ప్రభుత్వం హడావుడి చేసింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. 350 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు పంపినా ఏం చేసుకుంటారు? పట్టిసీమ, తాడిపూడి, నదుల అనుసంధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనవసర హడావుడితో తనకు తానే గందరగోళం చేసుకుంది. ఒక మంచి కార్యక్రమాన్ని అర్థం పర్ధం లేకుండా పూర్తి చేశామని అనిపించింది.