గిన్నిస్ బుక్ లో పట్టిసీమ

Update: 2015-12-08 10:38 GMT
పట్టిసీమ ప్రాజెక్టును గిన్నిస్ బుక్ లోకి ఎక్కించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో పూర్తిచేసి నీటి విడుదల చేసిన ఆ పథకానికి గిన్నిస్ బుక్ లోకి ఎక్కేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మంగళవారం నాడు ఆయన పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద ప్రాజెక్టు పనులను పరిశీలించారు.ఆ సందర్బంగా మాట్లాడుతూ మోటార్లను ఆరంభించి నీటిని తరలించిన తీరు రికార్డు అని అన్నారు.

పట్టిసీమను అడ్డుకోవడానికి చాలామంది చాలారకాలుగా ప్రయత్నించారని... అయినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా చెప్పిన సమయానికి పూర్తిచేశామని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణానదికి తీటిని తీసుకు వెళ్లి 2400 కోట్ల విలువైన పంటలను కాపాడామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాది 8500 క్యూసెక్కుల నీటిని తీసుకు వెళ్లవచ్చని అన్నారు. గోదావరి నదికి ఆయన హారతి ఇచ్చి పూజలు జరిపారు.

కాగా పట్టిసీమను అనుకున్న లక్ష్యానికి చంద్రబాబు పూర్తిచేసినా నీటి విడుదల చేసిన వెంటనే గండిపడడం వంటి అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ, వాటిని కూడా అధిగమించి వెంటనే సమస్యలు పరిష్కరించారు. మోటార్లను తెప్పించి యుద్ధ ప్రాతిపదికన బావులపై వాటిని అమర్చి నీటిని లిఫ్టు చేస్తున్నారు. మొత్తానికి పట్టిసీమ తక్కువ కాలంలో పూర్తయిన భారీ లిఫ్టు ఇరిగేషన్ పథకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News