ఏపీ అధికారపక్ష నేత చంద్రబాబుకు.. విపక్ష నేత వైఎస్ జగన్ కు మధ్యనున్న రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వీరి మధ్యనున్న విభేదాలు ఏ స్థాయికి వెళ్లాయో రీతిలో ఉన్నాయో తెలుగునాట అందరికి తెలిసిందే. బాబు తీరుపై.. ఆయన సర్కారు వ్యవహరిస్తున్న వైఖరిపై జగన్ సొంత మీడియా సంస్థలో వచ్చే కథనాలు.. దానికి కౌంటర్ వేస్తూ ఏపీ అధికారపక్ష నేతలు విరుచుకుపడటం ఒక రివాజుగా మారింది. కొన్ని సందర్భాల్లో సాక్షి మీడియాను కవరేజ్ కు ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉండటం లేదు.
తమ ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక కథనాలపై ముఖ్యమంత్రే తరచూ ప్రస్తావించటం.. ఈ సందర్భంగా సాక్షి పత్రిక పైనా.. విపక్ష నేత జగన్ మీదా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మీడియా వార్తల్ని కోట్ చేస్తూ.. తమ సర్కారు సాధించిన ఘనతగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకోవటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. సాక్షి పత్రికలో రాసే రాతలన్నీ అబద్ధాలని తరచూ తెగబడే చంద్రబాబు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సాక్షి పత్రికలో కృష్ణా పుష్కరాల మీద వ్యతిరేక వార్తలు రావటం లేదని.. అంటే.. ప్రభుత్వం పుష్కరాల్ని అంత బ్రహ్మాండంగా నిర్వహిస్తుందన్న విషయం తేలిపోయిందని తనను తానే పొగిడేసుకోవటం గమనార్హం.
ఈ రోజు పాజిటివ్ వార్తను తన గొప్పతనంగా క్లెయిం చేసుకున్న చంద్రబాబు.. రేపొద్దున తన ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేక వార్తను ఇలానే తీసుకుంటారా? అన్నది ఒక ప్రశ్న. అలా కాకుండా.. తప్పులు ఎత్తి చూపిస్తే తిట్టటం.. అంతా బాగుందన్నట్లుగా రాస్తే మెచ్చుకోవటం లాంటివి చేస్తే.. సాక్షి సంగతి తర్వాత చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. జన్మకో శివరాత్రి అన్నట్లుగా వచ్చే ఒకటీ అరా పాజిటివ్ వార్తల్ని కోట్ చేసి చంద్రబాబు మురిసిపోవటం పెద్ద తప్పుగా పలువురు చెబుతున్నారు. ఈ రోజు పొగడ్తను గొప్పగా చెప్పుకున్నప్పుడు.. తప్పుగా రాసిన రోజు కూడా అదే రీతిలో అంగీకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా పుష్కరాల వార్తల్ని రాసిన తీరును సాక్షిని ప్రస్తావించి బాబు తప్పు చేశారని.. ఆ విషయం భవిష్యత్తులో మరింత బాగా అర్థం కావటం ఖాయమన్న మాటల తెలుగు తమ్ముళ్లు లోగుట్టుగా గుసగుసలాడుకోవటం గమనార్హం.