బాబు సర్కార్ ఓ మెట్టు దిగి వచ్చింది. స్విస్ చాలెంజ్ అనే ఎవరికీ అర్థంకాని ఓ మాయ ముసుగులో అమరావతి నిర్మాణ పనులను తాము అనుకున్న సంస్థలకు, అనుకున్న వాటాలతో అప్పగించేయడానికి అన్నట్లుగా ఆరోపణలు ఎదర్కొంటున్న వ్యవహారంలో సర్కారు అనివార్యంగా ఒక మెట్టు దిగవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్విస్ ఛాలెంజ్ ఆలోచన లో అసలు పారదర్శకత లేదంటూ హైకోర్టు తీవ్రస్థాయిలో మొట్టికాయలు కూడా వేసిన తర్వాత గానీ.. ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పటికి నిర్మాణాలు చేసే సంస్థలకు ఆదాయ వాటాలు ఎలా ఉంటాయనే విషయం ముందుగా వెల్లడించడానికి ఒప్పుకున్నారు. అయితే అందులోనూ సాంకేతిక బిడ్‌లను తెరచిన తర్వాత, అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఆదాయవాటాల సంగతి చెప్తామంటూ ఓ మెలిక పెట్టారు.
అమరావతిలో నిర్మాణాలు చేపట్టే సంస్థలకు ఎంతెంత వాటాలు వస్తాయో.. ప్రభుత్వం టెండర్లు వేయదలచుకునే సంస్థలకు వెల్లడించకుండా సీక్రెట్ పాటించింది. సింగపూర్ కంపెనీలకు ఎంత వాటాలు వెళ్తాయో ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై కోర్టులో వ్యాజ్యం వాదోపవాదాల సమయంలో.. హైకోర్టు ప్రభుత్వ తీరును దారుణంగా తప్పుపట్టింది. ఇందులో పారదర్శకత లేదని పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది అప్పీళ్లను కూడా కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలో.. ఇక తప్పదన్నట్లుగా వాటాల విషయం వెల్లడించడానికి ప్రభుత్వం సిద్ధపడిందని సమాచారం.
అడ్వకేట్ జనరల్ ఇచ్చిన సలహా మేరకు గత్యంతరం లేని స్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీన్ని హైకోర్టుకు నివేదిస్తారు. దీని ప్రకారం ముందు సాంకేతిక బిడ్ లు తెరుస్తారు. అర్హత సాధించిన వారికి వాటాల వివరాలు చెబుతారు. తర్వాత ఆర్థిక బిడ్ లు వేయాలి.. తర్వాతే ఆర్థిక బిడ్ లు తెరచి కేటాయింపులు చేస్తారు.
ఈ టెండర్ల వ్యవహారంలో పారదర్శకత పెరిగే కొద్దీ.. చంద్రబాబు తలచిన కంపెనీలకే పనులు దక్కే అవకాశాలు సన్నగిల్లిపోతాయేమోనని ప్రజలు అనుకుంటున్నారు