బాబు టెక్నాల‌జీని వ‌దిలేశారా?

Update: 2016-09-07 22:30 GMT
తనను హైటెక్ చీఫ్ మినిస్టర్‌ గా చెప్పుకునే టీడీపీ అధినేత‌ చంద్రబాబు సాంకేతిక‌త‌పై మ‌న‌సు వ‌దిలేసుకున్నారా? గత ఎన్నికలలో కలిసొచ్చిన ఫేస్ బుక్ మంత్రం ప్రస్తుతం వికటిస్తోందా?  సోషల్ మీడియాలో టీడీపీ ఎదురీతకు కారణాలేంటి.? ముఖ్యమంత్రిగా అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు.. సోషల్ సైట్స్ లో మాత్రం ఎందుకు వెనుకబడిపోయారు? అనేది ఇపుడు రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న సాఫ్ట్‌ వేర్ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఈ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌ల్లో కొత్త నిర్ణ‌యం వెలువ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే సాంకేతిక పరిజ్ణానాన్ని రాజకీయాలకు అనుసంధించిన ఏకైక వ్యక్తిని అంటూ బాబు స్వ‌త‌హాగా ప్ర‌చారం చేసుకునే సంగ‌తి తెలిసిందే. ఆదినుండి తెలుగుదేశం పార్టీ సాంకేతికతకు పెద్దపీట వేసింది. ఇక ఫేస్ బుక్ ను సైతం విస్తృతంగా ఉపయోగించుకున్న చరిత్ర టీడీపీదే. టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీనీ పద్దెనిమిదిన్నర లక్షల మంది ఫాలో అవుతున్నారంటే సోషల్ మీడియాలో టీడీపీ హవా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు పేజీని ఫాలోఅవుతున్న వారు 7లక్షలు ఉండ‌టం గ‌మ‌నార్హం. సాక్షాత్తు యువనేత నారా లోకేషే బాధ్యత వహించి ఆన్‌ లైన్‌ ప్రమోషన్ ను విజయవంతంగా నడిపారు. బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ... సుమారు 40వేల మంది సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లు రెండు రాష్ట్రాలలో కూడా భారీగా ప్రచారం సాగించారు. కానీ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమైపొయిన అధినేత చంద్ర‌బాబు, పార్టీ ముఖ్యనాయకత్వం సోషల్ మీడియాను నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా కొంతకాలంగా సోషల్ మీడియాలో టీడీపీకి ఆదరణ తగ్గుతోంది. దీంతో ఒకప్పుడు హైదరాబాద్ సైబర్ సిటి వేదికగా సామాజిక మాధ్యమాలలో టీడీపీని పార్టీ అభిమానులు అగ్రస్థానంలో నిలబెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవిభజన జరగడం... సైబరాబాద్ తెలంగాణ ప్రాంతం కావడం ..ఇక్కడ టీడీపీ అధికారానికి దూరం అవ్వడం లాంటి చర్యలతో.. సాంకేతిక నిపుణులకు దూరం కావాల్సి వచ్చింది. అయితే నాడు  వారెవరినీ కూడా ఎన్నికల అనంతరం పట్టించుకోకపోవడంతో... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తెలుగునాడు నెట్‌ వర్కింగ్‌ వింగ్‌ కూడా దాదాపు పార్టీలో తెరమరుగయ్యింది. దీంతో టీడీపీ త‌న సోష‌ల్ మీడియా హ‌వాను ప‌రిమితం చేసుకోవాల్సి వ‌చ్చింది.

అయితే ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీపై దాడి జ‌రుగుతుండ‌టాన్ని పార్టీ అధిష్టానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. లోపాలను అంచనా వేసుకున్న టీడీపీ నష్టనివారణా చర్యలకు శ్రీకారం చుట్టింది. విచ్చిన్నం అయిన తెలుగునాడు సాంకేతిక విభాగం నిపుణులను ఒక్కగూటికి చేర్చి... మరోమారు సోషల్ ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించేదుకు రెడి అవుతోంది. పుష్కరాల విజయోత్సవాన్ని సోషల్ ప్రచారానికి వాడుకోవాలని డిసైడైన పార్టీ ఇప్పటికే థ్యాంక్యూ సీయం సార్ అంటూ క్యాంపెయిన్ సాగిస్తోంది. ఒక్క ఫేస్ బుక్ ద్వారానే కాకుండా...ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రచారం - వాట్స్ ఆప్ - ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ వాయిస్‌ ను ప్రజల్లోకి పంపేదుకు టీడీపీ సిద్దమ‌వుతోంది.
Tags:    

Similar News