బాబును పెట్రోల్ బంకులోళ్లు బెదిరిస్తున్నారు

Update: 2015-05-23 13:58 GMT
ఏపీలో మ‌రో నిర‌స‌నకు తెర లేవ‌నుంది. ఏపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న ధోర‌ణి కార‌ణంగా తాము న‌ష్ట‌పోతున్నామంటూ పెట్రోల్ బంకుల య‌జ‌మానులు ఆందోళ‌న‌కు సిద్ధం అవుతున్నారు.
ఇటీవ‌ల ఏపీ స‌ర్కారు పెట్రోల్‌.. డీజిల్ మీద విధించిన వ్యాట్ కార‌ణంగా ప్ర‌తి లీట‌ర్‌కు రూ.4 మేర అద‌న‌పు భారం ప‌డుతోంది. దీంతో.. దూర ప్రాంతాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల వారు.. ఆయారాష్ట్రాల్లోనే నింపుకొని రావ‌టంతో అమ్మ‌కాలు ప‌డిపోయాయ‌ని.. పెట్రోల్‌బంకుల సంఘాలు చెబుతున్నాయి.

దీంతో త‌మ వ్యాపారాలు తీవ్రంగా ప్ర‌భావితం అవుతున్నాయ‌ని.. పెంచిన వ్యాట్‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జూన్ మూడో తేదీ త‌ర్వాత త‌మ ఆందోళ‌న‌లు ఉధృతం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పెట్రోల్‌.. డీజిల్ పై వ్యాట్ పెంపు కార‌ణంగా అమ్మ‌కాలు భారీగా ప‌డిపోయాయ‌న్న విష‌యంపై అధికారులు సైతం దృష్టి సారించారు. ఇప్ప‌టికే వారు నివేదిక‌లు త‌యారు చేశారు. వ్యాట్ పెంపు కార‌ణంగా ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం మీద కూడా ప్ర‌భావం ప‌డిన‌ట్లు అధికారులు సైతం ఒప్పుకుంటున్న నేప‌థ్యంలో బాబు ఈ అంశంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News