తెలుగుదేశం అధినేత- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన ఆసక్తికరమైన సంఘటనలకు వేదికగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాకా అయిన కడప జిల్లాలోని ఇడుపులపాయ ఎస్టేట్ కు తొలిసారిగా చంద్రబాబు వెళ్లారు. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో జరిగిన స్నాతకోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు.
అయితే ఈ పర్యటనలో చంద్రబాబు పర్యటన ఆసక్తికరంగా సాగింది. చంద్రబాబు తన ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ వైఎస్ ఆర్ సమాధి - పొలాలను వీక్షించారు. కడప జిల్లాలోని ఖాజీపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంతో పాల్గొన్న అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనటానికి చంద్రబాబు ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లారు.