ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రెడీ అవుతున్నారా? సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నిక జరగని నేపథ్యంలో మరో డైరెక్ట్ వార్ కు ఆయన శ్రీకారం చుట్టారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరపాలక సంస్థతో పాటు 11 మున్సిపాలిటీలు - కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు తీర్పులు - రాజకీయ కారణాలతో ఈ పోరు వాయిదా పడుతోంది. తాజాగా చంద్రబాబు వేసిన అడుగు ఎన్నికల కేంద్రంగా సాగిందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన 11 నగర పాలక సంస్థలు - మున్సిపాలిటీల కమిషనర్లు - అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. సాయంత్రం సుమారు 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 10.30 గంటల వరకూ సాగింది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు - నగరపాలక సంస్థలకు సంబంధించి సర్వే జరిపించారు. ఆయా మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులు - ఆక్రమణలతో పాటు వీధికుక్కల లెక్కల వివరాలను చంద్రబాబు సేకరించారు. మున్సిపాలిటీలు - నగరపాలక సంస్థల్లో రోడ్లు - డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా తేల్చారు. విశాఖ నగరంలో రోడ్లు - డ్రైన్లు బాగానే ఉన్నప్పటికీ నగర శివార్లు - విలీన ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి పనులు జరగడం లేదని, పారిశుద్ధ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, మరీ ముఖ్యంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మంచినీటి సౌకర్యాన్ని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. వీలైనంత వరకూ ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని ఆయన ఆదేశించారు. డ్రైన్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు.
నగరాల్లో రౌడీయిజం పెరిగిపోతోందని, పోలీస్ అధికారులను సమన్వయపరచుకుంటూ అదుపు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భూ ఆక్రమణలను - ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టాలని ఆదేశించారు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారని సమాచారం. ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు పూర్తిచేయాలని, అవసరమైనచోట వార్డుల విభజన కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తంగా ఎన్నికల కోణంలో బాబు ఈ ప్రత్యేక మీటింగ్ ఏర్పాటుచేసి ప్రతి అంశంపై సూటిగా దిశానిర్దేశం చేశారని స్పష్టంగా కనిపిస్తోంది.