2019 ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవం పాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు 46 ఏళ్ల వయసున్న జగన్ దడ పుట్టించారు. 151 సీట్లతో విజయదుందుభి మోగించిన జగన్...తన ప్రభంజనంతో టీడీపీ పునాదులు షేక్ చేశారు. 40 ఈయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు జగన్ దెబ్బకు వణికిపోయారు. దీంతో, బాబు టైం అయిపోయిందని - టీడీపీ పగ్గాలను మరో బలమైన యువనేతకు అప్పగించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఏపీలో టీడీపీ బతకాలంటే...జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని బాబుకు టీడీపీలోని పెద్ద తలకాయలు 9 నెలల క్రితమే సలహా ఇచ్చాయట. అయితే, పార్టీలో తానే రాజు తానే మంత్రి అనే మైండ్ సెట్ ఉన్న చంద్రబాబు ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారట. ఇక తాజా పరిణామాల మధ్య తప్పని పరిస్థితుల్లో జూనియర్ కు జై కొట్టాలని బాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఘోర పరాభవం తర్వాత ఏపీలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావలంటే చంద్రబాబు చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అయితే, ఈ 9 నెలల్లో బాబు తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం వర్కవుట్ కాలేదు. బాబు మాస్టర్ మైండ్ తో ఎత్తుగడలు వేసినా ....అవి విఫల ప్రయత్నాలుగా మిగిలాయి. దీంతోపాటు, తాజాగా బాబుకు అండగా ఉండే వెటరన్ బ్యాచ్ సంఖ్య తగ్గిపోయింది. దీంతో, మిగిలిన సీనియర్లు కూడా బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని సలహా ఇస్తున్నారట. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి - ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు - కేడర్ డీలా పడిపోయారు. మరోవైపు జగన్ నానాటికీ బలం పుంజుకుంటున్నారు...కేంద్రంలో బీజేపీతో టీడీపీకి సఖ్యత లేదు....ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్‌తో పొత్తు వ్యర్థం...దత్తపుత్రుడు పవన్ అండ టీడీపీకి లేదు...లోకేశ్ కు పార్టీని నడిపే సామర్థ్యం లేదు....మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలవకపోయినా....పరువు దక్కించుకోవాలంటే కీలక నిర్ణయం తప్పదు.
ఇవన్నీ ఆలోచించిన బాబు...జూనియర్ ఎన్టీఆర్ కు జైకొట్టాటని నిర్ణయించుకున్నారట. అదికూడా....స్థానిక సంస్థల ఎన్నికలలోపే జూనియర్ ను రంగంలోకి దింపే యోచనలో బాబు ఉన్నారట. జూనియర్ రాకతో కేడర్ లో జోష్ వస్తుందని...మున్సిపల్ ఎన్నికలకు ముందే పగ్గాలు అప్పగించాలని బాబు ఆల్రెడీ...డిసైడ్ అయ్యారట. ఏపీలో పార్టీని బ్రతికించుకోవాలంటే లోకేష్ ని వదిలి ఎన్టీఆర్ కు బాధ్యతలు అప్పగించక తప్పదని బాబు బలంగా ఫిక్స్ అయ్యారట. బాబు నిర్ణయంపై టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. తన నీడను కూడా తన స్థానంలో అధ్యక్షుడిగా ఊహించుకోవడానికి ఇష్టపడని చంద్రబాబు `తారక`మంత్రం జపిస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!