చంద్ర‌బాబు.. ఈ మాట‌లు స‌మంజ‌స‌మేనా?

Update: 2019-12-20 05:47 GMT
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక‌వైపు చంద్ర‌బాబు నాయుడు వైసీపీపై స్పందిస్తూ.. వాళ్లు అధికార దుర్వినియోగం చేస్తున్నార‌ని, పోలీసుల‌ను తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై దాడుల‌కు ఉప‌యోగించుకుంటూ ఉన్నార‌ని  ఆరోపిస్తూ ఉన్నారు. అలా కాసేపు చాలా ప్ర‌జాస్వామ్యికంగా మాట్లాడే చంద్ర‌బాబు నాయుడు ఆ వెంట‌నే తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ ఉన్నారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌తో తేల్చుకోవ‌డానికి రెడీ అని చంద్ర‌బాబు నాయుడు అంటున్నారు. పోలీసులు మ‌ధ్య‌లో వ‌ద్ద‌ని తామే వైసీపీ నేత‌ల‌తో తేల్చుకుంటామంటూ తెలుగుదేశం అధినేత ప్ర‌క‌టిస్తూ ఉన్నారు. అమీతుమీ తేల్చుకోవ‌డానికి రెడీ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. అనంత‌పురంలో చంద్ర‌బాబు నాయుడు వీరావేశంతో రెచ్చిపోయారు. వైసీపీ వాళ్ల‌తో ఫేస్ టు ఫేస్ తామే తేల్చుకుంటామ‌ని.. ప్లేస్ వాళ్లు చెప్పినా స‌రే, తాము చెప్పమ‌న్నా స‌రే అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ను త‌ల‌పించేలా మాట్లాడారు.

సినిమా డైలాగులు కొట్టారు. ఒక‌వైపు ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడుతూ. .మ‌ళ్లీ తామే తేల్చుకుంటామ‌ని.. దాడుల‌కు రెడీ అని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక త‌ను త‌లుచుకుని ఉండుంటే.. వైసీపీ నేత‌లు అస్స‌లు మిగిలే వాళ్లు కార‌ని కూడా చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. త‌న చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు వాళ్ల‌ను ఏదైనా చేయాల‌నుకుని ఉంటే ఆపేవారు ఎవ‌రన్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. అలా వైసీపీ నేత‌లు బ‌తికి ఉండ‌టం కేవలం త‌న ద‌య అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఇక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి కూడా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న పార్టీ వాళ్ల‌పై కేసులు పెడుతున్నార‌ని - ఆర్టీఐ అధికారులు జేసీ బ‌స్సుల‌పై దాడులు చేస్తున్నార‌ని.. అవ‌న్నీ ఉన్మాద చ‌ర్య‌లు అని చంద్ర‌బాబు నాయుడు తేల్చారు.  అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏం చేసినా.. ప‌ర్మిట్లు లేకుండా బ‌స్సులు న‌డిపినా ఆప‌కూడ‌దు. అలా ఆపితే అది ఉన్మాదం అని చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. ఇలా త‌మ వాళ్ల త‌ప్పుల‌ను కూడా చంద్ర‌బాబు నాయుడు క‌ప్పిపుచ్చుకుంటూ వ‌చ్చి చివ‌ర‌కు అధికారాన్ని కోల్పోయారు. ఇర‌వై మూడు సీట్ల‌కు మిగిలారు. అయినా ఆయ‌న తీరులో మాత్రం మార్పు వ‌చ్చిన‌ట్టుగా లేద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News