ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడప్పుడే విడుదల కావు. ఏపీలో పోలింగ్ ముగిసి ఇప్పటికే నెల పూర్తి అయిపోయింది. అయినా ఇన్నాళ్ల పాటు ఎగ్జిట్ పోల్స్ కోసమే వేచి చూడాల్సి వచ్చింది ప్రజలంతా. ఫలితాలకు నాలుగు రోజుల ముందు మాత్రం అవి విడుదల కాబోతున్నాయి. దేశమంతా పోలింగ్ పూర్తి అయ్యేంత వరకూ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయడానికి వీల్లేదన్న ఎన్నికల కమిషన్ రూల్స్ ను పరిగణనలోకి తీసుకుని చానళ్ల వాళ్లు తమ ఎగ్జిట్ పోల్స్ ను చేసి కూడా కామ్ గా ఉన్నాయి.
అన్ని దశల పోలింగ్ పూర్తికాగానే అవి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేయబోతూ ఉన్నాయి. ఈ ఆదివారం సాయంత్రం ఐదు తర్వాత వివిధ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాబోతూ ఉన్నాయి.
అయితే రాజకీయ పార్టీల అధినేతలకు మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పటికే చేరిపోయాయని కొన్నిరోజలుగా వార్తలు వస్తున్నాయి. వివిధ వార్తా సంస్థలు రాజకీయ పార్టీల అధినేతలకు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయని తెలుస్తోంది.
అందులో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందాయని స్పష్టం అవుతోంది. అంతే కాదు.. అవి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా తేటతెల్లం అవుతోంది. చంద్రబాబు నాయుడు తన పార్టీ వారితో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు.
‘ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే వస్తాయి.. వాటిని చూసి కంగారు పడొద్దు..’ అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడాన్ని బట్టి చంద్రబాబుకు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందాయని, వాటిల్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఫలితాలు ఉంటాయని కూడా బాబు మాటలనే బట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.