చిత్తూరు మేయర్ కటారి అనురాధను దారుణంగా హత్య చేసిన వారిపైనా.. అందుకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా నేతల్ని హత్య చేయటం ఇదే తొలిసారని.. ఇలాంటి వాటిని తాము ఉపేక్షించమన్నారు. భయోత్పాతాన్ని సృష్టించటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి వారి తీరును కఠినంగా అణిచేస్తామన్నారు. పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా పాలన నడిచిందని.. ఇకపై అలాంటిది కుదరదన్న చంద్రబాబు.. చిత్తూరు ఘటనతో నిందితులు ఎలాంటి మెసేజ్ పంపించాలో చూడాలన్నారు.
సామాన్యుడికి భద్రత లేదన్న మేసేజ్ ను వారు పంపారని.. ఇలాంటి వాటి విషయంలో తాము నిర్లక్ష్యంగా వ్యవహరించమని.. నిందితులు ఎంతటి వారైనా.. వారి వెనుక ఎవరున్న వదిలేది లేదన్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు కాపాడమని చెప్పామని.. దీని వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారన్నారు.
హత్యలు చేయటం నీచ రాజకీయమని.. ఇలాంటి వారు ఎవరినైనా వదిలేది లేదన్నారు. అభద్రతా భావంతో ఉంచటం నాగరిక ప్రపంచంలో నీచమని.. ఇలాంటి వారి వల్ల సామాన్యులు తమకు భద్రత లేదని భావిస్తారన్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మేయర్ ను చంపటం ద్వారా సమాజానికి వారిచ్చిన మెసేజ్ ఏమిటన్న చంద్రబాబు.. శాంతిభద్రతల మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేయటం.. అభద్రతను గురి చేయటం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఫ్యాక్షన్ చరిత్రలో మహిళలను చంపిన ఉదంతాలు ఉన్నాయా అని కూడా బాబు ప్రశ్నించారు. అలాగే గుడివాడలో ఓ మహిళ తన ఇళ్లు ఖాళీ చేయమన్నందుకు వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన దౌర్జన్యాన్ని కూడా ఆయన ఖండించారు.
తానీ మధ్య తిరుపతి వెళ్లినప్పుడు ఆమె కలిశారని.. రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా పలు పంచుకుంటారని.. అలాంటి ఆమెను చంపివేయటంపై బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరపూరిత రాజకీయాల్ని తాను కట్టడి చేస్తానని.. హత్యలు చేసి సవాళ్లు విసురుకునే వైఖరిని చూస్తే.. ఉన్మాద స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించటంతో పాటు.. ఇలాంటి నేరాలు చేయటానికి భయపడేలా చేస్తామన్నారు.