ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తానెంత కష్టపడినా.. జాతీయ స్థాయి నాయకుల్ని తెచ్చినా.. జగన్ మీద ఉన్న సానుకూలతలో మార్పు రావటం లేదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు.. కేసీఆర్ ను తానెన్ని తిట్టినా ఫలితం లేదన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది.
దీంతో.. ఎన్నికల చివరి రోజుల్లో ఎలాగైనా ఏపీ ఓటర్లను భావోద్వేగానికి గురి చేయాలన్న తలంపులో ఉన్నారు. ఇందులో భాగంగా భారీ ప్లానింగ్ చేపట్టినట్లుగా చెబుతున్నారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు ఏపీ వ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి.. ఇంట్లో వారికి వీర తిలకం దిద్ది రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎందుకిలా? అంటే.. చంద్రబాబు చెబుతున్న మాట ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి వీరతిలకం దిద్దాలని.. దాంతో పౌరుషానికి లోనైన వారు టీడీపీకి అనుకూలంగా ఓటేస్తారన్న వాదనను వినిపిస్తున్నారు. పౌరుషం పొడుచుకు వస్తే.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వంలోని నెగిటివ్ పాయింట్లు గుర్తుకొచ్చి.. రివర్స్ పౌరుషం తన్నుకొస్తే.. ఏమవుతుందంటారు బాబు..?
తన కెరీర్ లో ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రిని చూడలేదన్న చంద్రబాబు.. తమ నేతలపైన తనిఖీలు చేపడుతూ ఇబ్బంది పెడుతున్నారని.. సోదాల పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా మండిపడుతూ.. అంతకంతకూ బదులు తీర్చుకునేలా ఓట్లను ఆయుధాలుగా మార్చాలని బాబు చెబుతున్నారు. మరి.. ఏపీ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.