అమరావతి శంకుస్థాపన జరిగిన ఏడాది పూర్తయినప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పెద్దగా వేగం పుంజుకోని నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ప్రత్యేకతను అమరావతికి జోడించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశంలో సీఆర్ డీఎ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు - జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అంతర- బాహ్య వలయ రహదారులు ఉండాలని చంద్రబాబు చెప్పారు.
ప్రధానంగా అంతర్ - బాహ్య వలయ రహదారులపైనే సాగిన ఈ సమావేశంలో ఈ రహదారులకు సంబంధించి సీఆర్ డీఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మూడు ఆప్షన్లను సీఎం ముందు ఉంచారు. రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు - జాతీయ రహదారులను కలిపేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం ఉండాలని, రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశంలో మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. తెనాలి - గుడివాడ - నూజివీడు - సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారి - విజయవాడ-ముంబై జాతీయ రహదారి - విజయవాడ-జగదల్ పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా ఉండేలా ప్రజారాజధానిలో బాహ్య వలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగితే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది అవన్నీ కాలగమనంలో రాజధాని నగరంలో కలిసిపోతాయని చంద్రబాబు వివరించారు. రానున్న కాలంలో రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు.
బాహ్య వలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారు. బాహ్య వలయ రహదారి లోపల ప్రస్తుతం ఉండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు ఉంటుందని - ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని గుర్తు చేశారు. రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ ఉండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్ షిప్ లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందన్నారు. అంతర్ వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ ఉన్న తెనాలి - మంగళగిరి - సత్తెనపల్లి - నూజివీడు - గుడివాడ - మచిలీపట్నం - తాడేపల్లి వంటి ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటినుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలని చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబర్ నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్ల ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/