పని రాక్షసుడన్న పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును తరచూ పోలుస్తూ ఉంటారు. నిజమే.. ఆయన అసలుసిసలు పని రాక్షసుడు. కానీ.. రోజులు గడిచే కొద్దీ పని చేసే తీరులో స్మార్ట్ నెస్ పోయి.. బండగా పని చేసే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. తాను చేసిన తప్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వారు విజేతలుగా మారతారు. అందుకు భిన్నంగా ఎంత ఎక్కువ కష్టపడితే.. అంత ఎక్కువ ఫలితం పొందుతామన్న పిచ్చి లెక్కలతో వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
బాబు తీరు చూస్తే.. ఆయన పిచ్చ పీక్స్ కు వెళుతుందా? అన్న సందేహం కలుగక మానదు. ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. పార్టీ సమీక్షల్ని అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ నిర్వహించిన వైనం చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ దారుణాతి దారుణంగా ఓటమిపాలైన తర్వాత.. చేసిన తప్పుల్ని సమీక్షించుకోవాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణి చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఒక రాజకీయ పార్టీ నిర్వహించే జిల్లా సమీక్ష ప్రపంచంలో ఎవరైనా అర్థరాత్రి12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఎవరైనా నిర్వహిస్తారా? దాని ద్వారా సాధించేదేమిటి? ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అదే పనిగా గంటల కొద్దీ రివ్యూలు చేయటం ద్వారా అధికారులు.. రాజకీయ నేతల సహనానికి పరీక్ష పెట్టిన చంద్రబాబు.. ఇప్పటికి తన రివ్యూ పిచ్చను వదిలిపెట్టటం లేదు.
అనుకోని రీతిలో ఎన్నికలు ముంచుకొచ్చి.. టికెట్ల లెక్కను ఫైనల్ చేయాలన్న వేళలో.. ఈ రీతిలో కసరత్తు చేయటాన్ని అంతో ఇంతో అర్థం చూసుకోవచ్చు. అందుకు భిన్నంగా.. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు సరకదా.. సమీప భవిష్యత్తులో కూడా ఎన్నికలు రాని పరిస్థితి. అలాంటివేళలో అర్థరాత్రి అంకమ్మ శివాలు అన్న రీతిలో ఈ రివ్యూలు ఏమిటని పార్టీ వర్గాలు విస్తుపోతున్నాయి. ఇక.. చంద్రబాబు తీరును చూసిన ఇతర రాజకీయ పార్టీల నేతలు హేళనగా నవ్వుతున్న పరిస్థితి. ఎంత నిద్ర రాకపోతే మాత్రం.. నేను నిద్రపోను.. ఎవరినీ నిద్ర పోనివ్వనన్న వైనం సరికాదు కదా చంద్రబాబు?