ఆ జ‌ర్న‌లిస్ట్ మాట‌తో ఉలిక్కిప‌డ్డ బాబు!

Update: 2018-11-30 04:59 GMT
సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌టానికి వ‌చ్చిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఒక సిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాజీవ్ గాంధీతో క‌లిసి అమీర్ పేట‌లో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి హాజ‌రైన త‌ర్వాతి రోజున.. ఆయ‌న శేరిలింగంప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో పాటు.. మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఆయ‌న ప్ర‌చార ర‌థంపైన ఉన్నారు.

ప్ర‌ఖ్యాత ఎన్డీటీవీ ఛాన‌ల్ ప్ర‌ముఖుడు.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా పేరుతో పాటు.. ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొనే ప్ర‌ణ‌య్ రాయ్ బాబు వెంట కొన్ని ప్రాంతాల్లో  బాబు ప్ర‌చార ర‌థంపై క‌నిపించారు. ఒక రోడ్ షో పూర్తి అయిన వేళ‌.. అక్క‌డే ఉన్న అభ్య‌ర్థితో మాట్లాడుతూ.. బాబు పీఎం కావాల‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారా?  రోడ్ షోకు వ‌చ్చిన ప్ర‌జ‌ల స్పంద‌న ఏమిట‌న్న ఆలోచ‌న క‌లిగింది. ఆ వెంట‌నే.. మైకు అందుకున్న శేరిలింగం ప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థి భ‌వ్యా ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. త‌న‌ను ఎన్డీటీవీ ముఖ్యుడు అడిగిన ప్ర‌శ్న‌ను అడుగుతున్నాన‌ని.. ప్ర‌జ‌ల స్పంద‌న ఏమిటో తెలుసుకోవాల‌ని ఆయ‌న అనుకున్న‌ట్లుగా చెబుతూ..  బాబును ప్ర‌ధాని చేయ‌టంపై ప్ర‌జ‌లేం అనుకుంటున్నార‌న్న ప్ర‌శ్న‌ను సంధించారు.

 ఆ వెంట‌నే రోడ్ షోలో ఉన్న వారంతా.. పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేశారు.ఈ  ప‌రిణామానికి వెంట‌నే రియాక్ట్ అయిన చంద్ర‌బాబు.. త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి మీద ఎలాంటి ఆశ లేద‌ని.. సీమాంధ్ర‌కు తాను చేయాల్సింది చాలా ఉంద‌ని చెప్పుకున్నారు చంద్ర‌బాబు. గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో ఏపీని ముంచేసిన చంద్ర‌బాబు.. ఏపీ అధికారం త‌న చేతిలో ఉంటే ఏదేదో చేస్తాన‌ని చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. బాబు పీఎం ఆశ సంగతేమో కానీ.. ఇప్పుడున్న సీఎం పోస్ట్ ఎగిరిపోవ‌టం ఖాయ‌మ‌న్న జోస్యాన్నిప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌స్తావిస్తున్నారు. మొత్తంగా జ‌నాన్ని ప్ర‌శ్నిస్తున్న‌ట్లే ప్ర‌శ్నించిన ప్ర‌శ్న‌కు బాబు ఒక్క‌సారి ఉలిక్కిప‌డేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News