ఆంధ్రుడి హక్కును పోరాటంతో సాధించాల్సింది పోయి.. కేంద్రంతో రాజీ పడిన ఏపీ సర్కారు ప్రత్యేక హోదాను వదిలేసి చాలాకాలమే అయ్యింది. పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకేజీతో ఏపీ జనుల భవిష్యత్తును తాకట్టు పెట్టేసిన చంద్రబాబు..పోరాటం చేయరే అంటే.. ఆయన నోటి నుంచి చిత్రమైన మాటలు వస్తుంటాయి. మోడీ మీద పోరాటం చేస్తే వచ్చే లాభం ఏమిటన్నట్లుగా ఆయన మాట్లాడతారు. పోరాటం చేయకుండా.. మోడీ చెప్పిన ప్రతిదానికి డూడు బసవన్నలా తల ఊపితే ఏపీకి జరిగిన లాభం ఏమిటన్నది చూస్తే.. గుండు సున్నానే అని చెప్పక తప్పదు.
ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేని పరిస్థితి మోడీ సర్కారుకు ఉందనే అనుకుందాం. ఒకవేళ అలాంటిదే ఉంటే.. ఎంతో చేయాల్సిన ఏపీకి ఏమీ చేయలేకపోతున్నామన్న భావనతో.. మిగిలిన రాష్ట్రాలకంటే కాస్తంత ఎక్కువ కేటాయింపులు ఏపీకి చేశారా? అంటే అదీ లేదు. న్యాయంగా రావాల్సింది రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటప్పుడు మోడీ పవర్ కు రాజీ పడి ఊరకుండిపోవాలా? అన్నది ప్రశ్న.
పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. చివరకు అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించుకున్నారు. కేంద్రంతో పేచీ పెట్టుకుంటే వచ్చే కాసిన్ని నిధులు కూడా రావన్నదే వాదన అయితే.. కేంద్రం వేసే ముష్టిగింజల కోసం మరీ అంతగా తాపత్రయపడాలా? అన్నది ప్రశ్న. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటా రావాలే కానీ.. కేంద్రం ముష్టి వేస్తుంది? ఆ ముష్టి కోసం వినయంగా.. విధేయతతో వ్యవహరించకపోతే ఎలా? అన్న ప్రశ్నలు వేసుకోవటం అంటే.. అంతకుమించిన చేతకానితనం మరొకటి ఉండదు.
సమాఖ్య వ్యవస్థలో కేంద్రం.. రాష్ట్రాలు రెండు ఒకదానితో మరొకటి సహకరించుకోవాల్సిందే కానీ.. ఒకరు చాలా ఎక్కువ.. మరొకరు చాలా తక్కువన్నట్లుగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదేజరిగితే.. సమాఖ్య వ్యవస్థ అన్న మాటలో అర్థం లేదని చెప్పాలి. విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టం ఏమిటన్నది అందరికి తెలిసిందే. ఒక ప్రధాని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని సైతం నెరవేర్చకపోవటాన్ని ఎలా చూడాలి? ప్రధాని ఇచ్చిన హామీనే తూచ్ అంటే.. ఇంకే విషయం మీద నమ్మాల్సి ఉంటుంది. పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్పించి.. మరింకేమీ కాదన్నవిషయాన్ని గుర్తించి ముందుకు అడుగు వేయాలే కానీ.. కేంద్రంతో పేచీ పెట్టుకుంటూ కూర్చుంటే అభివృద్ధి జరుగుతుందా? అంటూ సొల్లు మాటల్లో అర్థం లేదనే చెప్పాలి.
ఎందుకంటే..ఏపీలో ఇప్పుడు అద్భుతం జరుగుతున్నట్లుగా చెబుతున్న చంద్రబాబు.. గతంలో తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా పాలించారు. ఇప్పటితో పోలిస్తే.. అప్పట్లో ఆయన చాలా పవర్ ఫుల్ అని చెప్పాల్సిందే. మరి.. అంత పవర్ ను ఉన్న వేళలోనే ఆయన ఏపీని ఎంతగా మార్చారో తెలిసిందే. ఒకవేళ ఆయన అప్పుడే కానీ మార్చేసి ఉంటే.. ఈ రోజు అభివృద్ధి గురించి ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరమే ఉండేది కాదు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమన్నమాట వచ్చేదే కాదు. అభివృద్ధి అన్నది అంతులేని కథ. అది ఇప్పట్లో ముగిసేది కాదు. దాన్నో బూచిలా చూపిస్తూ.. న్యాయమైన హక్కుల్ని కూడా సాధించుకోలేని చేతకాని దద్దమ్మాల్లా ఉండేకన్నా.. పోరాడితేనే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కేంద్రంతో పోరాటం చేయటం మొదలు పెడితే.. మోడీ వేసే ముష్టి కాస్త తక్కువగా ఉంటుందన్నదే నిజమైతే.. మరీ.. అంత ముష్టి బతుకు అవసరమా? ఆత్మగౌరవం అన్నది లేకుండా ముష్టి తినే కంటే.. నిండైన ఆత్మగౌరవంతో అర్థాకలితో ఉండటం మేలేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/