తెలంగాణ రాజకీయాల్లో కాస్త ఆచితూచి అడుగులేస్తూ.. అంత దూకుడుగా వ్యవహరించని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి ధీటుగా తాము కూడా పోరాడతున్న విషయాన్ని తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం చెప్పకనే చెప్పేస్తుంది.
గ్రేటర్ ప్రచారం ముగియటానికి మూడు రోజుల ముందు ఆయన గ్రేటర్ పరిధిలోని పలుప్రాంతాల్లో రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నెల 28.. 29 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. తాజాగా ఆయన ప్రచారం చేస్తున్న ప్రాంతాలు చూస్తే.. సీమాంధ్రకు చెందిన సెటిలర్లు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఆయన ప్రచారం చేస్తుండటం గమనార్హం.
జనవరి 28న బాబు ప్రచారం చేసే ప్రాంతాలు
= పటాన్ చెర్వు
= శేరిలింగంపల్లి
= జూబ్లీహిల్స్
= కుత్భుల్లాపూర్
= కూకట్ పల్లి
జనవరి 29న బాబు ప్రచాంర చేసే ప్రాంతాలు
+ ఎస్ ఆర్ నగర్
+ సనత్ నగర్
+ ఉప్పల్
+ ఎల్ బీ నగర్
+ సరూర్ నగర్
+ మలక్ పేట