ఏపీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ గా పేరున్న దేవినేని ఉమకు ఊహించని అవమానం ఎదురైంది. అది కూడా.. తమ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీపంలో కావటం గమనార్హం. విజయవాడలో తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నేతలు.. కార్యకర్తలు హాజరయ్యారు. అందరి మాదిరే మంత్రి దేవినేని ఉమ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం ఆయన చేశారు. అయితే.. బాబుకు రక్షణగా ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోలు ఉమను అడ్డుకున్నారు. ఐదారు అడుగుల దూరంలో ఉన్న ముఖ్యమంత్రి వద్దకు మంత్రిని వెళ్లకుండా అడ్డుకోవటంతో దేవినేని ఉమ ఒక్కసారి విస్తుపోయారు. అంతలోనే సర్దుకొని.. తాను మంత్రినని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
చివరకు.. లోకల్ పోలీసులు కల్పించుకొని.. దేవినేని ఉమ ఎవరో బ్లాక్ క్యాట్ కమెండోలకు చెప్పటంతో ఆయన్ను చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు అనుమతించారు. ఇటీవల ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో చంద్రబాబుకు భద్రతను మరింత తీవ్రతరం చేశారు. బ్లాక్ క్యాట్ కమెండోలకు తెలుగు రాకపోవటం.. తరచూ మారిపోవటంతో మంత్రుల్ని గుర్తించటంలో జరిగిన పొరపాటుతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. ఎంత బ్లాక్ క్యాట్ కమాండోలు అయినా.. మంత్రుల్ని కూడా గుర్తించలేనంతగా పరిస్థితి ఉంటుందా? అన్న వాదన వినిపిస్తోంది. ఏమైనా.. అధినేతకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తనను కలుసుకునేందుకు అనుమతించని వైనంపై మంత్రి దేవినేని ఉమ కాసింత షాక్ తిన్నారనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/