ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు హంగు ఆర్భాటాల మీద మోజెక్కువ. అవసరం ఉన్నా లేకున్నా భద్రత పేరుతో హడావుడి చేయటం ఆయనకు అలవాటు. అప్పుడెప్పుడో అలిపిరిలో ఆయన మీద దాడి జరిగిన ఉదంతాన్ని చూపిస్తూ.. జడ్ ప్లస్ భద్రతను తీసుకోవటం తెలిసిందే.
అధికారంలో ఉన్నా.. లేకున్నా ఆయన భద్రత విషయంలో మాత్రం భారీతనానికి ఏ మాత్రం లోటు రానివ్వరు. అయితే.. తాజాగా జగన్ భద్రతపై కోత విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనకు కల్పించే భద్రతను ఏపీ రాష్ట్ర పోలీసులు క్రమపద్దతిలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు.
మొన్నటివరకూ చంద్రబాబుకు కేంద్రం ఎన్ ఎస్ జీ భద్రత ఉండేది. దీనికి అదనంగా జడ్ ప్లస్ భద్రత కూడా కల్పించేవారు. అయితే.. తాజాగా మాత్రం ఆయనకున్న భద్రతలో కోత పెట్టారు. భద్రతా సిబ్బందిని క్రమపద్దతిలో తగ్గించటంతో పాటు.. కృష్ణా.. గుంటూరు జిల్లాల్లో ఆయనకు ఎస్కార్టు తొలగించారు. విజయవాడలో రోడ్డు క్లియరెన్స్ ను కూడా ఎత్తేశారు. దీనిపై టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. ప్రతిపక్ష నేతగా ఎంత అవసరమో అంత మేర భద్రత దళాల్ని వినియోగించుకోవాలే కానీ.. ఆర్భాటం కోసం భద్రతను వాడుకోవటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.