సీరియస్ గా రాజకీయాల గురించి మాట్లాడే చంద్రబాబు తన వ్యక్తిగతవిషయాల్ని చెప్పటమా? ఉన్నట్లుంది ఎందుకలా? అన్న సందేహంఅక్కర్లేదు. నిన్నటి (సెప్టెంబరు 10)కి చంద్రబాబుకు పెళ్లి అయి.. 35సంవత్సరాలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన మీడియాప్రతినిధులతో కాసేపు పాత గుర్తుల్ని నెమరవేసుకున్నారు. రాజకీయాల్నిపూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా వ్యక్తిగత విషయాల్ని పంచుకున్నచంద్రబాబు తన తొలినాళ్ల కెరీర్ గురించి.. పెళ్లి.. అత్తమామల గురించిఎన్నో ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని లీలగా చెప్పటం గమనించాల్సిన అంశం. మరి.. చంద్రబాబు చెప్పిన పెళ్లి నాటి ముచ్చట్లను చదువుదామా?
1978లో విద్యార్థి సంఘం నేతగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోకవర్గం నుంచి పోటీ చేసి గెలిచా. అప్పట్లో చాలా దూకుడుగా ఉండేవాడిని. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వద్దకు వెళ్లి నాకూమంత్రిపదవి కావాలనిఅడిగా. మొదటిసారి ఎమ్మెల్యేవి.. అప్పుడే మంత్రిపదవి అడుగుతావా? అని ఆయన కొద్దిగా నొచ్చుకున్నారు. నాకున్న అర్హతల్ని చెప్పి వాదించాను. కానీ ఆయన నాకు పదవి ఇవ్వలేదు. అప్పట్లో అసమ్మతి రాజకీయాలు జోరుగా ఉండేవి. అప్పట్లో మేం చెన్నారెడ్డికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత రాజారాంను బలపరిచాం. ఆయన చాలా సమర్థుడు. కానీ.. రోడ్డుప్రమాదంలో మరణించారు. తర్వాత కొంతకాలానికి చెన్నారెడ్డి దిగిపోయి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. 64 మందితో జంబో మంత్రి వర్గాన్నిఏర్పాటు చేసి నన్నూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రుల్ని చేశారు.
అప్పట్లో నాకు శాఖలు ఇవ్వటానికి ఏమీ లేక సినిమాటోగ్రఫీ.. సాంస్కృతిక శాఖ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ వచ్చి నన్ను కలుస్తుండేవారు. హైదరాబాద్ లో సినిమా థియేటర్లు ఆయనే చూస్తుండేవారు. అవి అప్పట్లో చాలా ఫేమస్. హైదరాబాద్ వస్తే వాటిని తప్పక చూడాలని మా ఊళ్లల్లో అనుకునేవాళ్లం. కాంగ్రెస్ లోని వర్ గరాజకీయాల్ని చూసి..చూసి విసుగొచ్చింది. ఏదో ఒకటి చేయాలనిపించింది. ఎన్టీఆర్ తో మీటింగ్ ఏర్పాటు చేయాలని జయకృష్ణను కోరా. నాచారంలోని రామకృష్ణా సినీ స్టూడియోలో అనురాగ దేవత షూటింగ్ జరిగే సమయంలో జయకృష్ణ నన్ను అక్కడికి తీసుకెళ్లారు.
ఆ రోజును మర్చిపోలేను. ఆ సినిమాలో శ్రీదేవి హీరోయిన్. ఆ రోజు పెళ్లిసీన్ షూట్ చేస్తున్నారు. రామారావుగారు పెళ్లి బట్టల్లో మెరిసిపోతున్నారు. ఆ స్టూడియోలో నేనూ.. రామారావుగారు గంటన్నరపాటు మాట్లాడుకున్నాం. 60 ఏళ్లు వచ్చే వరకూ తాను తన కుటుంబం కోసం సినిమాల్లో పని చేస్తానని.. ఆ తర్వాత సమాజం కోసం.. ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. తర్వాతి రోజుల్లో మా ఇంటికి సీఎం అంజయ్యను..రామారావుగారిని పిలిచి వారి మధ్య మీటింగ్ ఏర్పాటు చేశాను. వర్తమాన రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు.
ఈ ఘటన జరిగిన కొన్నాళ్ల తర్వాత జయకృష్ణ.. మా బంధువు విశ్వేశ్వరరావు కలిసి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కూడా వారితో ఉన్నారు.మా పెళ్లి కుదిర్చింది వీరే. సినిమా శాఖకు మంత్రిగా ఉండటం ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం ఏర్పడటానికి ఒక కారణం. కట్నం అడగలేదు. ఆయన ఇవ్వలేదు. కాకుంటే.. రాజకీయ నాయకుడిని కాబట్టి పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాలని మాత్రం అడిగా. రామారావుగారు ఒప్పుకున్నారు.మద్రాస్ లో పెళ్లి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కుమార్తెతో పెళ్లిచేసుకుంటున్నానని.. మా వాళ్లు ఇంటింటికి పెళ్లిశుభలేఖల్ని పంచారు.
పెళ్లి అయ్యాక హైదరాబాద్ లోని వెంగళరావు పార్కు దగ్గర కాపురం పెట్టాను.అక్కడ ఇబ్బందిగా ఉందనుకొని జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బాలకృష్ణ ఉన్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టిస్తానని రామారావుగారు నాకు చెప్పారు. వద్దని చెప్పాను. రామారావుగారు ఎవరికీ ఇల్లుకట్టిస్తానని చెప్పలేదని.. ఆయనంతట ఆయన అడిగినప్పుడు ఒప్పుకోవటం మంచిదని మా అత్తగారు నా భార్య దగ్గర గొడవ పెట్టారు.అయినా వద్దని చెప్పా. తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయి.. ఇల్లు ఖాళీ చేసి మెహిదీపట్నంలో ఒక చిన్న ఇంటికి మారాను. అప్పటికి జూబ్లీహిల్స్ లో బాలకృష్ణ ఇల్లు కట్టుకున్నాడు. కానీ.. ఆయన మద్రాస్ లో ఉండేవారు. దాంతో రామారావుగారు మమ్మల్ని ఆ ఇంటికి మార్పించారు. అక్కడ ఇల్లువద్దని అనుకున్నా.. చివరకు ఆ స్థలంలో కట్టిన ఇంట్లోనే ఉండక తప్పలేదు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత నన్ను పార్టీ మారొద్దని ఆయనే చెప్పారు.తనదే అస్థిమితంగా ఉందని.. పార్టీలోకి వచ్చి ఇబ్బంది పడవద్దని సలహాఇచ్చారు. నేను అసలు పోటీ చేయకూడదని అనుకున్నా. కానీ.. పోటీచేయాలని ఆయనే చెప్పారు. దాంతో పోటీ చేసి ఓడిపోయా.