రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు బ్రాహ్మణికి సంబంధించిన ఓ అంశంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎప్పుడూ లేని విధంగా బ్రాహ్మణికి సంబంధించి పొలిటికల్ చర్చ పార్టీ వర్గాల్లో సాగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. బాబుకు ఏ మాత్రం ముందుచూపు ఉన్నా.. బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు తెలుగు తమ్ముళ్లు తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తుంటారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే బ్రహ్మణిలో ప్రజాకర్షకణ పుష్కలంగా ఉందన్న మాట పలువురు చెబుతుంటారు.
దీనికి తోడు పలు సందర్భాల్లో ఆమె మాటలు విన్న వారు.. చాలా స్పష్టతతో ఆమె మాట్లాడతారని.. తెలుగుదేశం పార్టీకి ఆమే ఫ్యూచర్ అని వ్యాఖ్యానించే వర్గం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. బ్రాహ్మణి మాత్రం పార్టీ వ్యవహారాల్లో వేలు పెట్టింది లేదనే చెప్పాలి. అయితే.. అందుకు భిన్నంగా ఆమెకు సంబంధించిన ఉదంతం ఒకటి ఇప్పడు తెరపైకి వచ్చింది. ఆమె.. ఇటీవల ఒక థర్డ్ పార్టీ ద్వారా ఏపీ వ్యాప్తంగా సర్వే చేయించారని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న ప్రశ్న మీదనే ఆమె ఫోకస్ చేశారని చెబుతున్నారు.
దీనికి సంబంధించిన ఫలితాలు షాకింగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి 57సీట్లకు మించి రావని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ ను మేనమామ చేతికి బ్రాహ్మణి ఇచ్చిందని.. ఈ ఫలితాల్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తాజా సర్వేలో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయం మీద వెల్లడైన వివరాలు ఓకే కానీ.. విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్.. పవన్ కల్యాణ్ కు చెందిన జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్న వివరాలు మాత్రం బయటకు రాకపోవటం గమనార్హం.
పోవటం.. హోదా విషయంలో పార్టీ వెనక్కి తగ్గటం.. పాలనలో పెరిగిన అవినీతి కూడా ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. బ్రాహ్మణి చేయించిన సర్వే మీద అధికారిక సమాచారం బయటకు రాకున్నా.. ‘సర్వే’ వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/