చూడటానికి సామాన్యులకు ఇది మామూలు వార్తనే కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గట్టి షాక్ లాంటి పరిణామం !
ఆయన ప్రచార ఆర్బాటం తెచ్చిన పరువు సమస్య. ఇంతకీ విషయం ఏంటంటే... త్వరలో కొత్త వెయ్యి రూపాయల నోట్లను రిలీజ్ చేయనున్నారు. కొత్త కలర్ కాంబినేషన్ - కొత్త డిజైన్ తో రూ.1000 నోటను విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఇవాళ తెలిపారు. మరికొన్ని నెలలలో ఆ వెయ్యి నోట్లు మార్కెట్లోకి వస్తాయన్నారు. కొత్త నోట్ల డిజైన్‌కు సంబంధించిన ప్రక్రియ గత రెండు మూడు నెలలుగా సాగుతోందని, ఆర్ బీఐకి చెందిన కేవలం ఇద్దరు ముగ్గురు అధికారులు మాత్రమే ఆ ప్రక్రియలో నిమగ్నమైనట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇది బాబుకు షాకిచ్చిన లేటెస్ట్ అప్ డేట్ అని అంటున్నారు.
అదెలాగా అంటే నోట్ల రద్దు గురించి వెల్లడైన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పెద్ద నోట్ల రద్దు వెనక తానే ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. రూ.500 - రూ.1000 రద్దు కోసం తాను ఎప్పటినుంచో ప్రధానమంత్రికి చెప్తున్నట్లు వివరించారు. రెండో రోజు కూడా మీడియాతో మాట్లాడుతూ...500 - 1000 నోట్ల రద్దు బానే ఉంది కానీ 2000 నోటు అవసరం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇపుడు పరిస్థితి ఏంటంటే... నోట్ల మార్పిడి మాత్రమే తప్ప రద్దు ఉండదు. పైగా శుభ్రంగా కొత్త రూపంతో రూ.1000 నోటు కూడా వచ్చేస్తోంది. అందుకే...అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ప్రపంచంలో ఏది జరిగినా తన ఘనత చెప్పుకొంటే వచ్చే కీర్తి సంగతి దేవుడు ఎరుగు కానీ ఇలా పరువుపోవడం మాత్రం పక్కా అని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/