నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా తుది దశకు చేరుకున్న ప్రచార పర్వంలో ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారుణ్య రసం పండించారు. ఆయనకు మంత్రి భూమా అఖిలప్రియ సైతం తోడయ్యారని తాజాగా జరిగిన ప్రచార తీరును చూసిన వాళ్లంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల రోడ్ షో లో మాట్లాడుతూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి చనిపోయినపుడు తాము ఆళ్లగడ్డలో పోటీ చేయలేదని చంద్రబాబు గుర్తుచేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పట్ల కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని యజ్ఞంలా ముందుకు వెళ్తుంటే రాక్షసులు అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
ఈ సందర్భంగా గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ``సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నన్ను కాల్చాలంటున్నారు .ప్రజలకు మంచి చేస్తున్నందుకే నా బట్టలు ఊడదీస్తారా ? రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న తనపై విపక్ష నేత వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. కాల్చి చంపాలని పిల్లలకు నేర్పితే రేపు వారేమవుతారు ? ఓటు అనేది ఓ ఆయుధం. అది ప్రజల చేతుల్లో ఉంది. మనం వారిని కాల్చనక్కర్లేదు. ఉరేయక్కర్లేదు ఓటుతోనే ఖతం చేయాలని, ఓటుతో వారి అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం`అని సీఎం చంద్రబాబు తెలిపారు. నంద్యాల మార్కెట్ భూములను శిల్పా మోహన్ రెడ్డి కాజేశారని చంద్రబాబు ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశ పెడితే తర్వాత ప్రభుత్వం దీపాన్ని అర్పివేసిందన్నారు. పేదలకు ప్రతి నెలా అందించే పెన్షన్ ను రూ.1000కి పెంచామన్నారు. ఒకటవ తేదీన ప్రజలకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాలు, రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులెవరైనా ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షల వరకు భీమా ఇస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో తిరుపతి - విశాఖ నగరాలను సుందరంగా తీర్చిదిద్దామని, అదేవిధంగా కర్నూల్ ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. నంద్యాలకు మూడు నెలలో 285 పనులు మంజూరు చేసి, రూ.2200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా వైకాపా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోందని మంత్రి అఖిలప్రియ విమర్శించారు. భూమా నాగిరెడ్డి చావుకు కారణమైన వ్యక్తికి వైసీపీ టికెట్ ఇచ్చి నంద్యాల అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు ద్వారా భూమా నాగిరెడ్డిని బతికించుకోవాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా భూమా మండిపడ్డారు.