అవసరానికి వాడేసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాక్ రికార్డును టచ్ చేసే పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ అధినేత ఉండరని చెప్పక తప్పదు. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో బాబుకు తెలిసినంత భారీగా మరెవరికీ తెలీదంటారు. అయితే.. అక్కున చేర్చుకోవటం.. అవసరం అయ్యాక కరివేపాకులా పక్కన పెట్టేయటం బాబుకే సాధ్యం.
తాజాగా అరవింద సమేత సక్సెస్ మీట్ కు హాజరైన బాలకృష్ణ.. తారక్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. తారక్ వెన్నంటే ఉండటం లాంటివి చూస్తే.. ఉన్నట్లుండి.. ఇంత ప్రేమ ఎందుకు? అన్న క్వశ్చన్ రాక మానదు. అదే సమయంలో కొన్ని సందేహాలు రాక మానవు. ఇప్పుడింత ప్రేమను పొంగిస్తున్న బాలయ్య బాబాయ్.. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తారక్ ను దగ్గరకు ఎందుకు రానివ్వలేదు? అన్నది మరో ప్రశ్న.
2014లో బాబు వాడేసుకోవటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయన్ను ఫుల్ గా వాడేసుకోవటం మీద దృష్టి పెట్టటంతో తారక్ గుర్తుకు రాలేదు. ఇప్పుడేమో పవన్ తన దారిన తాను చూసుకున్నాడు. బాబును తనను వాడేసుకోవటం మీద క్లారిటీ రావటంతో పాటు.. బాబుతో కలిసి ఉంటే తన ఇమేజ్ గల్లంతుకావటం ఖాయమన్న ఆలోచనతో పాటు.. మర్రి చెట్టు కింద ఎక్కువ కాలం ఉండకూడదన్న విషయాన్ని ఆయన గుర్తించినట్లు చెబుతారు. ఈ కారణంతోనే బాబు తప్పుల్ని తీవ్ర స్వరంతో ఎత్తి చూపించటం ద్వారా.. ఆయన్ను కలవటం ద్వారా తాను చేసిన భారీ తప్పును సరిదిద్దుకునే కార్యక్రమాన్ని చేపట్టారా? అన్న భావన కలగటం ఖాయం.
ఇక.. తారక్ విషయానికి వస్తే.. మరి కొద్దినెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. యంగ్ ఫోర్స్ అవసరమైన వేళ.. చేతికొచ్చిన లోకేశ్.. ఇప్పటికే ఎమ్మెల్యే అయిన తన బావమరిది బాలయ్య పనికి రారన్న విషయాన్ని బాబు గుర్తించినట్లుగా చెబుతారు.పవన్ ఒక వైపు.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మరోవైపు దూసుకొస్తున్న వేళ.. తనకంటూ బలమైన స్వరం కావాలని.. అది తారక్ అయితే అన్ని విధాలుగా సరిపోతుందన్న ఆలోచన చేసినట్లు చెబుతున్నారు.
తన తండ్రి హరికృష్ణ హఠ్మాన్మరణంతో ఒంటరి అయిన తనకు అండనిస్తూ..అంత్యక్రియల సమయంలో చంద్రబాబు తిప్పిన చక్రం ఎంతన్నది అందరికి తెలిసిందే. ఇలాంటి వేళ.. తనకు విధేయుడిగా మారిన తారక్ ను మరింత వాడేసేందుకు వీలుగానే తాజాగా బాబాయ్ ఎంట్రీ అని చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది కాలమే సరిగా చెప్పగలదు.