విజయవాడలో టీడీపీ రాజకీయాలు తెగ మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని లక్ష్యంగా రాజకీయాలు సాగుతున్నాయని టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పే కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను టీడీపీలోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేశినేని నానికి పొగపెడుతున్నారని... ఆయన్ను జీరో చేసి వచ్చే ఎన్నికల్లో కనీసం టిక్కెటు అడగడానికి కూడా వెనుకాడేలా చేయాలని పథక రచన చేస్తున్నారని నాని వర్గం వారి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని నాని వర్గీయుల నుంచి వినిపిస్తోంది. నానిని పూర్తి స్థాయిలో వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని.. అందులో భాగంగానే ఆయన్ను రెచ్చగొడుతున్నారని అంటున్నారు.
మరోవైపు నానిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్స్‌కి వ్యతిరేకంగా కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ సర్కార్‌ను తెగ ఇరకాటంలో పెడుతున్నారు. కేశినేని వ్యాఖ్యలపై పార్టీపరంగా ఎవరూ స్పందించడం లేదు. అయితే నానిని పూర్తిగా రెచ్చగొట్టి.. ఆ తర్వాత సాగనంపేందుకు చంద్రబాబు స్కెచ్ రెడీ చేశారన్న ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ కుమార్ రెడ్డితో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టించారని అంటున్నారు. మొత్తానికైతే విజయవాడలో కేశినేని వర్గాన్ని అణగదొక్కుతున్నారని... ఆయన పార్టీ మారినా మారొచ్చని వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/