చంద్రబాబు ప్రతీ రోజు కేసీఆర్ ను తిట్టనిదే నిద్ర పోవడం లేదు. ప్రతి సభలోనూ కేసీఆర్ కుట్రపన్నారు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. జగన్ తో కలిసి కుట్ర చేస్తున్నాడని నెత్తి నోరు బాదుకుంటున్నారు. సభల్లో, సమావేశాల్లో కేసీఆర్ ను బూచీగా చూపి ఓట్లు దండుకునే ఎత్తును బాబు వేశాడు. కానీ తెలంగాణలో పనిచేసిన ఈ ‘స్వాభిమాన’ మంత్రం ఏపీలో పనిచేస్తుందా? ఏపీ జనాలు కేసీఆర్ ను బూచీగా చూపితే టీడీపీకి ఓట్లు గుద్దుతారా అంటే నో అనే అంటున్నారు..
పచ్చ మీడియా విస్తృత ప్రచారం ఏపీలో టీడీపీకి కలిసి రావడం లేదు. చంద్రబాబు ఎంత మొత్తుకున్నా.. టీడీపీ అనుకూల మీడియా కేసీఆర్ ను విలన్ చేసే కుట్రను చేసినా ఏపీ జనాలు మాత్రం అస్సలు కేసీఆర్ ను పట్టించుకోవడం లేదట.. తాజాగా ఎన్నో ప్రసార మాధ్యమాలు మైకులు పట్టుకొని ఏపీలోని జనాల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయి. వారు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏమాత్రం విశ్వసించడం లేదు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని.. బాబును హైదరాబాద్ నుంచి తరిమికొట్టారని.. తెలంగాణలో జరిగే అభివృద్ధి తమకూ కావాలని కోరుకుంటున్నారే తప్ప కేసీఆర్ పై ఎక్కడా విధ్వేషం పెంచుకోవడం లేదని మీడియా ముఖంగా చెప్పడం విశేషం.
నిజానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాబు ఎంత తిడుతున్నా కేసీఆర్ స్పందించడం లేదు. అనవసరంగా ప్రతిస్పందిస్తే బాబుకు అస్త్రం ఇచ్చినవాడిని అవుతానని.. ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్చవద్దని కేసీఆర్ సైలెంట్ అవుతున్నాడు. కానీ ఏపీ ప్రజలు మాత్రం బాబు చేస్తున్న కేసీఆర్ యాంటీ విమర్శలను మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు. తమకు న్యాయం చేసేవారు.. మాట మీద నిలబడే వారు.. అభివృద్ధికి తోడ్పడే నాయకుల కోసం చూస్తున్నారు తప్పితే.. కేసీఆర్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. స్వయంగా వివిధ ప్రసార మాధ్యమాల్లోనే ఈ విషయం తేటతెల్లమవుతోంది. దీన్ని బట్టి కేసీఆర్ ను బూచీగా చూపి ఓట్లు దండుకోవాలనుకుంటున్న బాబు ఆశలు నెరవేరేలా కనిపించడం లేదట..