నరేంద్ర మోడీ సర్కారు 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం చంద్రబాబు నాయుడి పుణ్యమే అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఈ ప్రక్రియ మొదలై ఎన్నో నెలలైంది. మధ్యలో ఏమైనా ఉప్పందిందో ఏమో.. చంద్రబాబు కేంద్రానికి ఒక లేఖ రాసి పారేశారు. ఇప్పుడు నిర్ణయం రాగానే తన సూచనను మన్నించినందుకు థ్యాంక్స్ అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పెద్ద స్థాయిలో ఏ పరిణామం జరిగినా క్రెడిట్ కోసం ప్రయత్నించడం చంద్రబాబుకు అలవాటే. అలాగే అమెరికా ఎన్నికల ఫలితాల విషయంలోనూ క్రెడిట్ కొట్టేద్దామనుకున్నాడు బాబు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందన్న సర్వేల ఫలితాల్ని చూసుకుని.. తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు.
గతంలో చంద్రబాబు.. హిల్లరీ కోసం విరాళాల సేకరణ చేపట్టడం.. తాజాగా ఆమెకు మద్దతు ప్రకటించడం గుర్తు చేస్తూ.. ఆమె విజయంలో బాబు పాత్ర కీలకం అని ప్రచారం చేశారు. అమెరికాలోని ఎన్నారైలందరూ బాబు మాట వింటున్నారని.. హిల్లరీకే ఓటేస్తున్నారని.. అందుకే ఆమె గెలిచేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం భారీగా జరిగింది. పనిలో పనిగా ట్రంప్ మీద విమర్శలు కూడా గుప్పించేశారు బాబు. తీరా చూస్తే ఫలితం తిరగబడింది. ట్రంప్ భారీ విజయం సాధించాడు. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. ఈ ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తారా..? చంద్రబాబు స్పందన తెలియజేస్తూ ప్రకటన చేస్తారా..? అసలు హిల్లరీ ప్రమాణ స్వీకారానికి బాబుకు అందిన ఆహ్వానం మాటేంటి..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి తనకు సంబంధం లేని అమెరికా ఎన్నికల విషయంలో బాబు భలేగా ఇరుక్కున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/