ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంపై కొత్త చర్చ మొదలైంది. సుదీర్ఘకసరత్తు అనంతరం చేపట్టిన మంత్రివర్గ విస్తరణపై ఇటు పార్టీ వర్గాలు - అటు రాజకీయవర్గాలు ఆసక్తికరమైన విశ్లేషణ చేస్తున్నారు. ఏపీ మంత్రివర్గంలో మార్పు - చేర్పులు జరిగి సరిగ్గా వందరోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ ఆసక్తకరమైన చర్చ వినిపిస్తోంది. కొత్త మంత్రులతోపాటు - మారిన పాత మంత్రుల శాఖలలో ఎవరి ప్రతిభ ఎంత అన్న అంశంపై సంస్థాగతంగా పార్టీలో, ప్రభుత్వపరంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంత్రులు పెద్దగా ప్రతిభ చూపకపోగా, మరికొందరు నాయకత్వాన్ని మెప్పించారు. వీరిలో రాజకీయంగా, శాఖాపరంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి అగ్రస్థానంలో ఉండగా, అసలు మీడియాతో సమావేశమయింది తక్కువే అయినప్పటికీ ఐటీ పరిశ్రమలను తీసుకురావడం ద్వారా మంత్రి లోకేష్ ప్రతిభ కనబరిచారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
చంద్రబాబు కొత్త టీంలో గత వందరోజుల కాలంలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి పనితీరులో అందరికంటే ముందున్నారని అంటున్నారు. రాజకీయంగా జగన్‌పై ఎదురుదాడి చేయడం, శాఖాపరంగా వ్యవసాయంపై నిరంతర సమీక్షలు - నకిలీ పురుగుమందులు - విత్తనాల కంపెనీల సీజ్ తోపాటు - నష్టపోయిన రైతులకు కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించారని టీడీపీ శ్రేణులు ప్రశంసిస్తున్నాయి. అదేవిధంగా మిర్చికి మద్దతుధర క్వింటాలుకు 1500 రూపాయలు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించారు. కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా ఆయన పార్టీలో ఊపు తీసుకువచ్చారని చెప్తున్నారు. జగన్ పై ఎదురుదాడిలో ఆయనే ముందున్నారని తమ్ముళ్లు ఖుష్ అవుతున్నారు. బాబు వారసుడిగా క్యాబినెట్ లో చేరిన లోకేష్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తాను నిర్వహిస్తున్న మూడు శాఖల్లో 130కిపైగా సమీక్షలు నిర్వహించారు. ఈ వందరోజుల్లో ఆయన ఎక్కడా మీడియా సమావేశాలు నిర్వహించలేకపోవడం విశేషం. 14 ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తేవడం ద్వారా గ్రాఫ్ పెంచుకున్నారని అంటున్నారు.
కొత్త టీంలో బెర్త్ పొందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు - విద్యుత్ శాఖ మంత్రిగా వివాదరహితుడైన కళా వెంకట్రావు తన ద్విముఖ పాత్రను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు, నంద్యాల వివాదం, జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు, విద్యుత్ శాఖ సమీక్షల్లో బిజీగా గడిపారు. సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వైసీపీపై ఎదురుదాడితోపాటు, శాఖాపరమైన వ్యవహారాల్లో నాయకత్వాన్ని మెప్పించారు. కార్మికమంత్రి పితాని సత్యనారాయణ సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న గుంటూరు బజరంగ్ జూట్ మిల్ కార్మిక సమస్యల ఫైల్ ను దుమ్ముదులిపి, వారిని చర్చలకు పిలిపించి తన అనుభవాన్ని చాటుకున్నారు. దానితోపాటు రాజమండ్రి పేపర్ మిల్లు సమస్య కూడా కొలిక్కితెచ్చారు. విజయనగరం జూట్ మిల్లు సమస్య పరిష్కారం కోసం చర్చలకు తెరలేపారు. అన్ని పార్టీలకు చెందిన ట్రేడ్ యూనియన్లతో తొలిసారి భేటీ నిర్వహించారు.
ఇక కొత్తగా మంత్రి అయిన భూమా అఖిలప్రియ నియోజకవర్గ స్థాయి నుంచి శాఖాపరమైన వ్యవహారాల్లోనూ పనితీరు అంతంతమాత్రమేనన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోందని రాజకీయవర్గాలు అంటున్నారు. ఆమె స్వల్పకాలంలోనే రాజకీయాల్లో వివాదాస్పద నేతగా ముద్రపడ్డారని అంటున్నారు. సుజయ కృష్ణ రంగారావుకు ఇంకా చాంబరు కూడా కేటాయించలేకపోవడం ఆసక్తరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి జవహర్ బీరుపై చేసిన వ్యాఖ్యలు - వైన్ షాపులు-బార్ల తరలింపుపై తీసుకున్న నిర్ణయం మహిళలను వ్యతిరేకతకు కారణమయిందని తమ్ముళ్లు వాపోతున్నట్లు చర్చజరుగుతోంది. మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం సమస్యలు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో విఫలమయ్యారంటున్నారు. కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి పని తీరు అంతంత మాత్రంగానే ఉందనే చర్చ సాగుతోంది.