తెలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న ఐటీ దాడులపై ఏపీలో అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ కలవరపాటుకు గురవుతోంది! ప్రధానంగా టీడీపీ నేతలు లక్ష్యంగా సాగుతున్న ఈ దాడుల విషయంలో ఆ పార్టీ రథసారథి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంత్రివర్గ సమావేశానికి ముందే మంత్రులతో చంద్రబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలు...రాష్ట్రంలో ఐటీ దాడులపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ దాడులను రాజకీయ కోణంలో - కేంద్రం తమపై చేస్తున్న దాడిగా చూడాలని చంద్రబాబు సహా మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
అనంతరం ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. తాజా రాజకీయాలు - కేసీఆర్ విమర్శలు - ఐటీదాడులపై చర్చలో రాజకీయ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ప్రధాని మోడీ దాడి అని సీఎంతో అన్న పలువురు మంత్రులు అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఐటీ బృందం రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి అని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా వందల మంది IT అధికారులు రంగంలోకి దిగడం వెనుక అంతర్యమేంటి అని ఈ భేటీలో పాల్గొన్న పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం మీద కేంద్రం చేసిన దాడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మూకుమ్మడి దాడులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది అని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎన్నికల ముందు అన్ని రాష్ట్రాల్లోనే ఇదే తరహా రీతిలో ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు మద్దతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడులు ఉద్దేశ్య పూర్వకంగా జరుగుతున్నాయని మంత్రుల వ్యాఖ్యలతో ఏకీభవించిన చంద్రబాబు కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతీస్తున్నారని వాపోయినట్లు సమాచారం. అందుకే ఐటీ దాడులకు వచ్చిన వారికి ఇచ్చిన సెక్యూరిటీ విత్ డ్రా చేసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని లా సెక్రటరీకి సీఎం ఆదేశించారు. తద్వారా ఈ అంశాన్ని న్యాయస్థానంలో ఎదుర్కుందామని ప్రతిపాదించినట్లు సమాచారం.