వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కొందరు ఉన్నతాధికారులను - నేతలను ఇప్పటికీ కేసులు వెంటాడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు.... చూసీచూడకుండా పెట్టిన సంతకాలు.. ఒకటేమిటి ఎన్నో రకాలు తప్పులు ఆ కాలంలో దొర్లినట్లు చెబుతారు. అంతేకాదు... దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో ముఖ్యమంత్రులు - రాష్టాల్లో మంత్రులు - కేంద్ర మంత్రుల స్థాయివారు తాము ఆ పైలు చూడకుండా సంతకం పెట్టామని చెప్పిన సందర్భాలున్నాయి. అయితే... ప్రస్తుత సీఎం చంద్రబాబు మాత్రం తన వద్దకు వచ్చే ఫైళ్లను మొత్తం చూసి కానీ సంతకం పెట్టరట. అందులో ఏ చిన్న తప్పున్నా కూడా సరిచేయించాకే సంతకం పెడతారట. తాజాగా జరిగిన ఘటన ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారు.. ఫైళ్లలోని తప్పులును ఎలా పట్టుకుంటారని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది.
తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం 4.01 గంటలకు ముందే అక్కడికి వెళ్లిన చంద్రబాబు ఉదయం 9 గంటల దాకా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో ‘ఏపీ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్ క్వార్టర్స్’గా నామకరణం చేసిన తాత్కాలిక సచివాలయంలో తాను ప్రారంభోత్సవం చేసిన గదిలో చంద్రబాబు కూర్చున్నారు. సచివాలయం ప్రారంభించిన సందర్భంగా లాంఛనంగా రుణమాఫీకి సంబంధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఐఏఎస్ అధికారులు రూపొందించిన సదరు ఫైలును చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన రెండు పొరపాట్లను ఎత్తిచూపారు. వాటిని సరిచేసిన తర్వాతే సంతకం పెడతానని చెప్పారు.
చంద్రబాబు ఆ తప్పులను పట్టుకోవడంతో అధికారులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. అయితే... అక్కడ కంప్యూటర్లు గాని, ప్రింటర్ గాని లేకపోవడంతో చేతి రాతతోనే సదరు తప్పులను సరిదిద్ది ఫైలును చంద్రబాబు ముందు పెట్టారు. అప్పుడు మరోసారి పరిశీలించిన తరువాత చంద్రబాబు ఇంకో తప్పునూ పట్టుకున్నారు. అది కూడా సరిచేశాక అప్పుడు సంతకం పెట్టారు.