తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే ఆ పార్టీ కార్యకర్తలపై ఏపీలో దాడులు జరుగుతూ ఉన్నాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాపోతూ ఉన్నారు. ఈ మేరకు ఆయన పర్యటననే చేపట్టారు. తమ కార్యకర్తలను పరామర్శిస్తూ రాజకీయ విమర్శలు చేస్తూ సాగుతున్నారు చంద్రబాబు నాయుడు.
అయితే రాష్ట్రంలో రాజకీయ హత్యల వ్యవహారం ఈ నాటిది కాదు. ప్రత్యేకించి 1995 తర్వాత ఈ పరిస్థితి చాలా పెరిగింది. లెక్కల ప్రకారం చూసినా - ఈ విషయం గురించి విశ్లేషణలను విన్నా రాజకీయ హత్యల విషయంలో మెజారిటీ ఆరోపణలు చంద్రబాబు నాయుడు మీద - తెలుగుదేశం పార్టీ మీదే ఉంటాయి.
కొన్ని వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అప్పట్లో దారుణ హత్యలకు గురి అయిన దాఖలాలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో అయితే ఫ్యాక్షన్ మొత్తం రాజకీయం ముసుగు వేసుకుని హత్యాకాండలు చేయించింది. అలాంటి వారికి అప్పుడూ - ఇప్పుడూ తెలుగుదేశం అండ ఉంది.
రాజకీయ హత్యల విషయంలో పరిటాల రవీంద్ర తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు - కార్యకర్తల హత్యల్లో పరిటాల రవి ప్రమేయం గురించి చాలా ఆరోపణలే వచ్చాయి. అలాగే ఆ తెలుగుదేశం నేతకు బోలెడంత మంది శత్రువులు కూడా అప్పుడే తయారయ్యారు.
తీరా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఆయన కూడా హత్యకు గురయ్యారు. ఆ హత్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసింది. రవిని హత్య చేయించింది ఆయన ఫ్యాక్షన్ శత్రువులు కాదు - వైఎస్ జగన్-జేసీ దివాకర్ రెడ్డిలే అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పరిటాల రవి భార్య సునీత కూడా అదే ఆరోపణే చేసింది.
ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డిని తెలుగుదేశంలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే! ఇక కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆరోపణలు చేసిందో అందరికీ తెలిసిందే. చివరకు అదే అదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవిని ఇచ్చారు! ఫిరాయించిన ఆయనకు ఎంపీ టికెట్ కూడా కేటాయిస్తే ప్రజలు చిత్తు కింద ఓడించారు.
ఇలా గతంలో తను ఆరోపణలు చేసిన వారికి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. ఇప్పుడేమో ఆయన మళ్లీ హత్యారాజకీయాలను నిరసిస్తూ ఉన్నారు! అయినా రాజకీయ హత్యలు - దాడులు అనేవి ఎప్పుడూ వన్ సైడెడ్ గా ఉండవని - అవన్నీ ప్రతీకారంతోనే జరుగుతాయనేది అందరికీ తెలిసిన మాటే. గత ఐదేళ్లలో అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్లు ఎక్కడైతే దాడులు చేసి ఉంటారో - ఇప్పుడు అక్కడే ప్రతిదాడులు జరుగుతూ ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.