ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రులకు కొత్త టార్గెట్ విధించారని విపక్ష వైసీపీ - పలువురు కాపు సంఘం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ మంత్రులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పై వరుస బెట్టి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పలువురు సీనియర్ మంత్రులు ఇటు విపక్ష నేత జగన్ - అటు కాపు ఉద్యమ నేత ముద్రగడపై విమర్శలు చేశారు.
కాపు ఉద్యమం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముద్రగడ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు మంత్రులు విమర్శించారు. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా మంత్రులు నారాయణ - గంటా శ్రీనివాసరావు - కిమిడి మృణాళినిలు ముద్రగడకు లేఖ రాశారు. ముద్రగడ తల్లీ - పిల్ల కాంగ్రెస్ లతో భేటీలు జరుపుతూ కాపు సోదరులకు కీడు చేస్తున్నారని ఆరోపించారు. ముద్రగడ తీరును యావత్ కాపులోకం అసహ్యించుకుంటోందన్నారు. జగన్ చేతిలో ముద్రగడ శిఖండిగా మారారనే భావన కాపుల్లో వ్యక్తమవుతోందని లేఖలో తెలిపారు. కాపులకు న్యాయం చేస్తున్న టీడీపీ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాపులకు నిజంగా న్యాయం చేయగలిగేది ముద్రగడనా లేక సీఎం చంద్రబాబునా అనేది అందరికీ తెలిసిందేనని తమ లేఖలో మంత్రులు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేచే ఏపీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు మరోమారు జగన్ తీరుపై విరుచుకపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేసింది వైఎస్.రాజశేఖర్‌రెడ్డి - జగన్ లేనని అన్నారు. అభివృద్దిలో చర్చకు రావాలని జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. జగన్ తో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రాజెక్టులపై అవగాహన లేని జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్ ప్రతిపక్షనేత అంటే నమ్మశక్యంగా లేదని రోజురోజుకు స్థాయి దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కాగా ఈ పరిణామంపై విపక్ష కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధులు - సీనియర్ నేతలు ఉండగా... మంత్రులు లేఖలు రాయడం - విమర్శలు చేయడం ఏమిటని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్ పెట్టారేమోనని సెటైర్లు వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/