డ్వాక్రా - రైతు రుణమాఫీ - నిరుద్యోగ భృతి - వృద్ధాప్య పెన్షన్లు - ఎన్టీఆర్ ఇళ్లు - చంద్రన్నబీమా - ఎస్సీ - ఎస్టీ - బీసీ పెళ్లికానుక - స్కాలర్ షిప్ లు...ఇవన్నీ ఏపీ ప్రభుత్వ పథకాలు అని అనుకుంటున్నారా కదా...అవును నిజమే. ఇవన్నీ...తెలుగుదేశం పార్టీ రథసారథి చంద్రబాబు సారథ్యంలోని ఏపీ ప్రభుత్వ పథకాలే. అయితే కేవలం ప్రభుత్వ పథకాలు మాత్రమే కాదు...అంతకుమించి. అంటే...ఏంటి అంటారా...సింపుల్..ఓట్లు రాల్చే స్కీంలు! 2019 తిరిగి అధికార పీఠాన్ని అందించే టీడీపీ అస్త్రాలు కూడా!!
టీడీపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అంచనాలు ఫలించి వచ్చే ముందస్తు ఎన్నికలు లేదా...షెడ్యూల్ ప్రకారం జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఇంటింటికీ లబ్దిదారుల వివరాలు సేకరించి...వారి వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించడం వల్ల అనూహ్య రీతిలో విజయాన్ని సాధించిన పద్ధతిని అమలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరింపజేయాలన్న నిర్ణయానికొచ్చారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ఈ కార్యక్రమాల్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు వృద్ధాప్య పెన్షన్లు - ఇళ్లు - చంద్రన్నబీమా - డ్వాక్రా - రైతు రుణమాఫీ - నిరుద్యోగ భృతి - ఎస్సీ - ఎస్టీ - బిసి పెళ్లికానుక - స్కాలర్ షిప్ లు ఇలా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికీ ఒక పథకం అందేలా ప్రణాళిక రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 60 శాతం మంది ఈ పథకాల కిందకు వస్తారని - ఈ ఏడాదిలో వీటిని పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రచారం చేయడంలో పార్టీ నాయకత్వం వెనుకబడిందని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్ని హెచ్చరించడం ద్వారా కచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ స్కెచ్ ప్రకారం ఇంటింటికీ వెళ్లి లబ్ధి పొందినవారి వివరాల్ని తీసుకుని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని వివరించడం ద్వారా పార్టీవైపు ఆకర్షితులయ్యే విధంగా చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారని సమాచారం. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కూడా మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అంటే సర్కారీ సంక్షేమ పథకాలను మరింతగా చేరవేసి...ప్రచారం చేసి...వాటి ద్వారా ఓటర్లకు తాయిలాలు ఇచ్చి...తిరిగి అధికారంలోకి రావడం అనేది బాబు 2019 ఎన్నికల ఆలోచన అని సమాచారం.