ఏపీ సీఎం చంద్రబాబు తాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పే హైదరాబాద్ నగరాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోలేకపోతున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఆయన దానిపై హైదరాబాద్ ముద్ర కూడా కనిపించేలా చేస్తున్నారు. ఏపీ - తెలంగాణల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్ గోల్కొండ కోట గురించి తెలియనివారుండరు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ గోల్కొండ కోట తరహాలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అలాంటి అవకాశం ఉందా అని పరిశీలించిన ఆనయకు కొండపల్లి కోట కళ్లెదుట కనిపించిందట. ఇంకేముంది... కొండపల్లి కోటను గోల్కొండలా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ దిశగా కొండపల్లి కోట పూర్వవైభవం ప్రజలకు వివరిస్తూ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం.
కొండపల్లి కోట కాకతీయుల కాలం నాటిది. పర్యాటక శాఖ కానీ, పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో ఇది పూర్తిగా పాడైంది. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలో ఇది ఉండడంతో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
కొండపల్లి కోటకు హంగులు అద్ది పర్యాటకులను ఇక్కడికి రప్పించేందుకు పర్యాటక శాఖ ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టిందట. లేజర్ షోల ఏర్పాటు వంటివి ఇక్కడ నిర్వహించనున్నారు. కొండపల్లి కోటకు సంబంధించిన శిల్పాలు - ఆధారాలు - శాసనాలు ప్రస్తుతం హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని కోట వద్దకే తెచ్చి చిన్నపాటి మ్యూజియంలా మలచాలన్నది ప్లాన్. కొండపల్లి గ్రామం నుంచి పైన కోట వరకు రోప్ వే - కొండపై ఆహార శాలలు - టాయిలెట్లు వంటివన్నీ నిర్మిస్తారు. చంద్రబాబు తలచుకోవడంతో ఇక కొండపల్లి కోట దశ తిరిగిపోతుందని... గోల్కొండ కోటను మించేలా పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.