మీడియా మొఘల్ రామోజీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ముందస్తుగా ఎలాంటి అంచనా లేని వేళ.. వారిద్దరి మధ్య భేటీ ఆసక్తికరంగానే కాదు.. రాజకీయంగానూ.. మీడియా వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రామోజీ ఫిలింసిటీలో రామోజీతో భేటీ వెనుక అసలు కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారన్న వేళ రామోజీని బాబు కలిసినట్లుగా చెబుతున్నారు. రవిప్రకాశ్ కు.. టీవీ9 కొత్త యాజమాన్యానికి మధ్య రాజీ కుదుర్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీవీ 9 కొత్త యాజమాన్యానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తను ఏపీకి పిలిపించుకొని బాబు మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని.. ఈ నేపథ్యంలో రామోజీకి ఉన్న పలుకుబడిని ఉపయోగించుకోవటానికి బాబు రంగంలోకి దిగినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
తనను వెనకేసుకొస్తూ భారీ ఎత్తున కథనాలు ఇచ్చిన రవిప్రకాశ్ రుణం తీర్చుకునేందుకు బాబు తెగ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రవిప్రకాశ్ పై కేసులు వద్దంటూ కొత్త యాజమాన్యానికి బాబు సూచించినట్లుగా తెలుస్తోంది. కొత్త యాజమాన్యం తన మాటల్ని పట్టించుకోని నేపథ్యంలో రామోజీ ద్వారా కథను నడిపించాలని బాబు డిసైడ్ అయినట్లుగా సమాచారం.
ఇందులో భాగంగానే రామోజీతో బాబు భేటీ అయినట్లుగా చెబుతున్నారు. టీవీ9 కొత్త యాజమాన్యంలో కీలకభాగస్వామి అయిన మైహోం రామేశ్వరరావుకు రామోజీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటివేళ.. రాజీ ప్రతిపాదన రామోజీ నుంచి వస్తే.. దాన్ని రామేశ్వరరావు కాదనలేరంటున్నారు. ఇందుకోసమే బాబు శ్రమపడి మరీ ఏపీ నుంచి హెలికాఫ్టర్ వేసుకొని మరీ ఫిలింసిటీకి వచ్చారంటున్నారు.