ఆ ఇష్యూలో.టీ సర్కారు బాటలోనే బాబు సర్కారు

Update: 2015-08-29 06:00 GMT
తరచూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని చెప్పుకునే చంద్రబాబు.. నెమ్మది నెమ్మదిగా ఏపీ ముఖ్యమంత్రిగా రూపాంతంరం చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా.. అనునిత్యం తెలంగాణ గురించి మాట్లాడే ఆయన.. వారి ప్రయోజనాలు కాపాడటం కూడా తన బాధ్యతే అన్నట్లు వ్యవహరించేవారు.

ఈ కారణం చేతనే.. ఏపీకి నష్టం వాటిల్లేలా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. తొందరపడి రియాక్ట్ అయ్యేవారు కాదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన తెలంగాణ సర్కారు ఉన్నంత కచ్ఛితంగా ఏపీ ముఖ్యమంత్రి ఉండేవారు కాదు. ఏదైనాతేడా వస్తే.. తెలంగాణలో తమ పార్టీకి రాజకీయంగా వచ్చే ఇబ్బందుల మీద కూడా దృష్టి పెటేవారు. దీంతో.. తెలంగాణ సమస్యల్ని కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన భుజాల మీద మోయాల్సి వచ్చేది. అయితే.. గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో చంద్రబాబు.. విజయవాడకు పరిమితం కావటం.. తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండా ఉంటున్న చంద్రబాబుకు తగ్గట్లే కొన్ని పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి.

రాష్ట్ర విభజన జరిగిన వెంటనే.. ఉమ్మడి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉన్న ఏపీ చరిత్రను తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసిపారేయటం తెలిసిందే. అయితే.. ఏపీ పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలంగాణ చరిత్రను తీసేసే విషయంపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు. విభజన తర్వాత పదిహేను నెలల తర్వాత నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఎనిమిది.. తొమ్మిది.. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలంగాణ చరిత్ర.. తెలంగాణ మాండలికంపై ఉన్న పాఠ్యాంశాల్ని తొలగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చూస్తుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదిలేస్తున్నట్లే కనిపిస్తోంది.
Tags:    

Similar News