మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రగిలిపోతున్నట్టు ఇటీవల ఆయన ప్రెస్ మీట్ ను బట్టి తెలుస్తోంది. జగన్ సర్కార్ కు 48 గంటల డెడ్ లైన్ విధించిన చంద్రబాబు నెక్ట్స్ ఏం కార్యాచరణ చేయబోతున్నాడనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఈ ప్రెస్ మీట్ లోనే చంద్రబాబు రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు వెనుకంజ వేయడంతో చంద్రబాబు ఒక్కడే రాజీనామా చేస్తాడు అని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అందరూ చంద్రబాబు రాజీనామా చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాడని అనుకుంటున్నారు.
కానీ మరి చివరి నిమిషంలో చంద్రబాబు రాజీనామా చేస్తాడా? లేక జగన్ ను తిట్టి తుస్సుమనిపిస్తాడో చూడాలని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబు రాజీనామా చేస్తే మాత్రం వెంటనే ఆమోదించడానికి వైసీపీ, స్పీకర్ రెడీగా ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.