‘ఉష లాంటి వైఫ్ ని వెతుక్కోండి’... తెలుగమ్మాయి లుక్స్ కి నెటిజన్స్ ఫిదా!

అమెరికాలో ట్రంప్ 2.0 శకం మొదలైంది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ సతీమణి, తెలుగమ్మాయి ఉషా వాన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు.

Update: 2025-01-21 06:54 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో ఈ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం.. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో... అగ్రరాజ్యం ద్వితీయ మహిళ హోదాను పొందిన తొలి ఇండియన్-అమెరికన్ గా ఉషా చిలుకూరి రికార్డ్ సృష్టించారు.

అవును... అమెరికాలో ట్రంప్ 2.0 శకం మొదలైంది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ సతీమణి, తెలుగమ్మాయి ఉషా వాన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. తన భర్త అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న వేళ ఒక చేతిలో పాపను, మరో చేతితో బైబిల్ ను పట్టుకుని.. జేడీ వాన్స్ వైపు చూసిన ఆమె చూపులకు ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా వరుస పోస్టులు పెడుతూ వారి వారి అభిప్రాయలను వెల్లడిస్తుండగా.. అవి నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... "మహిళలారా.. జేడీ వాన్స్ ను ఉషా వాన్స్ చూసే విధంగా మనం మన భర్తలను చూడాలి.. ఎంతో అందంగా ఉంది.. మీ భర్త గురించి గర్వపడండి" అంటూ వాన్స్ ప్రమాణం చేస్తున్న వేళ ఆమె తన భర్తను చూసిన చూపులకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు.

ఇదే సమయంలో... ఉషా చూపులకు ఫిదా అయిన కాల్టన్ బ్లేక్ అనే ఎక్స్ యూజర్ అదే ఫోటోను పోస్ట్ చేస్తూ... "పురుషుల్లారా.. జేడీ వాన్స్ ని ఉష చూసే విధంగా మిమ్మల్ని చూసే అమ్మాయిని కనుక్కొండి" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఈ విధంగా ఇప్పుడు ఉష చిలుకూరు చూపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగమ్మాయిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇదే సమయంలో జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేళ.. ఉష ధరించిన డ్రెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన పిక్ కోట్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.. ఆ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. కాగా.. ఉషా పేరెంట్స్ ఏపీ నుంచి యూఎస్ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆమె 1986లో అమెరికాలోనే జన్మించారు.

Tags:    

Similar News